1. ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల జ్ఝాపకశక్తిని పెంచడంతో పాటు మైండును ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతో ఎంత కష్టమైన పనైనా సులభంగా అధిగమించి శక్తిని పొందుతారు.
2. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలు పై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది.
3. జాగింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. జాగింగ్ తో పాటు మరికొన్ని వ్యాయామాలు మరియు మంచి డైట్ ఫాలో ఐతే చాలు తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది.
4. జాగింగ్ చేయడం వల్ల కండాలమీద, ఎముకలమీద ఒత్తిడి ఎక్కువై ఎముకల సాంద్రత పెరుగుతుంది. వేగంగా నడవటం, జాగింగ్, ఏరొబిక్స్, డాన్స్ చేయడం, ఆటలు ఆడటం లాంటివి మంచి వ్యాయామం.
5. జాగింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు, ఎటువంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల చిన్న చిన్న జబ్బులు, జలుబు, దగ్గు, జ్వరం వంటివే కాకుండా క్యాన్సర్ వంటి రోగాలను కూడా రాకుండా పోరడగలిగే వ్యాధినిరోధక శక్తిని పొందవచ్చు. రక్తం శరీరం అంతట సరఫరా అవ్వడానికి సహాయపడి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.