ఇలా చేస్తే మొటిమలు మటాష్


ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని పాడుచేయడానికి. మొటిమలు చాలా  నొప్పిగా ఉండటమే కాకుండా  అందాన్ని పోగొడతాయి. ఏ పార్టీకన్నా , ఫంక్షన్ కన్నా వెళ్ళాల్సినప్పుడు ముఖము మీద  మొటిమలు  చాలా  ఇబ్బందిని కలిగిస్తాయి. కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు మొటిమలు ఈజీగా తగ్గిపోతాయి. ఈ క్రింది  జాగ్రత్తలు పాటించి చూడండి.. మొటిమలు మాయమవ్వకపోతే అప్పుడు అడగండి.

  ముల్తాని మట్టికి రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం చాలా  అందంగా కనిపిస్తుంది.

* జాజికాయను నీటిలో నానబెట్టి, తరువాత అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.

* బియ్యం కడిగిన నీటిని ముఖం మీద ఉన్న మొటిమలపైన మృదువుగా రుద్దితే మొటిమలను తగ్గించుకోవచ్చు.

*
బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, చల్లటి నీళ్ళతో ముఖం మీద దుమ్ము పోయేలా ముఖం కడుక్కోవాలి. దుమ్ము వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది.

*
వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని ఎక్కువ  నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి

*
పసుపును నిమ్మరసంతో కలిపి ముఖానికి రాస్తే  మొటిమలు తగ్గుతాయి.