పెదవులు గులాబీ రేకుల్లా కనిపించాలంటే ఇంట్లోనే ఇలా లిప్ బామ్ రెఢీ చేసుకోండి..!

 


పెదవులు అందంగా, కోమలంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే చాలామంది పెదవులు అంత అందంగా ఉండవు. వీటికి లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్, లిప్ గ్లాస్ వంటివి వేసి అందంగా తయారుచేస్తుంటారు. కానీ ఇవన్నీ రసాయనాలతో నిండి ఉంటాయి.  ఇవి కాకుండా పెదవులను సహజంగా కోమలంగా, అందంగా మార్చేందుకు ఇంట్లోనే లిప్ బామ్ ను తయారచేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..

 
గరుకుగా, పొడిగా, నిర్జీవంగా వాడిపోయినట్టు ఉండే పెదవుల కోసం ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడితే పెదవులు మృదువుగా,  గులాబీ రంగులోకి మారతాయి.


గులాబీ రంగు పెదాలు కావాలంటే బీట్ రూట్ లిప్ బామ్ తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఏం కావాలంటే..


పెట్రోలియం జెల్లీ.. ఒకటిన్నర స్పూన్.


బీట్ రూట్ రసం.. అర టీ స్పూన్

తేనె.. అర టీ స్పూన్.

తయారీ విధానం..

మొదట పెట్రోలియం జెల్లీ , తెనె ఒక చిన్న కంటైనర్ లో వేయాలి.  అందులో బీట్ రూట్ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని మైక్రో ఓవెన్ లో 30 సెకెన్లు ఉంచాలి.  మైక్రో ఓవెన్ లేనివాళ్లు దీన్ని డబుల్ బాయిల్ మెథడ్ లో వేడి చేయవచ్చు.

వేడి చేసిన తరువాత ఈ లిప్ బామ్ లిక్విడ్ ను ఒక కంటైనర్ లో వేయాలి.  దీన్ని ఫిజ్ లో ఉంచి అరగంట తరువాత బయటకు తీయాలి.  ఇప్పుడు బీట్ రూట్ లిప్ బామ్ ఉపయోగించడానికి సిద్దంగా ఉన్నట్టే..


ఈ లిప్ బామ్ ను రోజూ పెదవుల మీద అప్లై చేస్తుంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఇది పెదవుల మీద మృతకణాలను తొలగిస్తుంది. పెదవుల నలుపు పోయేలా చేస్తుంది.  పెదవుల చర్మాన్ని రిపేర్ చేస్తుంది.  పెదవులు అందంగా,  నాజూగ్గా, గులాబీ రంగులోకి మారేలా చేస్తుంది.


                                                  *రూపశ్రీ.