పండుగలు,  పూజలు, శుభకార్యాలు, ఫంక్షన్లు అంటే అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం.  వీటి సందర్భంగా అందంగా ముస్తాబు అవ్వచ్చు.  అందరికీ తమ స్పెషాలిటీ ప్రెజెంట్ చేయవచ్చు. అయితే ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్స్ కు పరుగులు పెడుతూ ఉంటారు.  అక్కడ చేసే ఫేషియల్,  మసాజ్,  స్క్రబ్ మొదలైనవాటికి  వందలాది రూపాయలు ధారపోస్తుంటారు.  అయితే అలాంటి  అవసరం లేకుండా.. ఇంటి పట్టునే  శనగపిండితో స్ర్కబ్ తయారుచేసుకోవచ్చు. దీన్ని వాడితే ముఖం మెరిసిపోతుంది.  ఇంతకీ శనగపిండితో స్ర్కబ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..


శనగ పిండి,  పెరుగు..

ఈ స్క్రబ్ చేయడానికి, ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని, అందులో తగినంత పెరుగు వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమానికి సగం నిమ్మకాయ రసాన్ని జోడించవచ్చు. ఈ పేస్ట్‌ని బాగా మిక్స్ చేసి టాన్ అయిన చర్మంపై అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై కూడా అప్లై చేసి కొంత సమయం పాటు ఉంచుకోవచ్చు. దీని తరువాత చర్మాన్ని బాగా కడగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.  టానింగ్ తగ్గడం  ప్రారంభమవుతుంది. ఈ స్క్రబ్‌ని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించడం వల్ల చర్మం క్లిస్టర్ క్లియర్ అవుతుంది.


శనగ పిండి,  పసుపు..

ఈ స్క్రబ్ టానింగ్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీనికి 4 నుండి 5 చెంచాల శనగ పిండిని అర చెంచా పసుపు,  నీరు లేదా పెరుగుతో అవసరాన్ని బట్టి కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయాలి. దీనికి నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. టానింగ్  ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ అప్లై చేయాలి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేయాలి.

శనగ పిండి,  పాలు..

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి,  చర్మంలోని మృతకణాలను తొలగించడానికి శనగపిండిలో పాలు, నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారుచేయాలి. 4 చెంచాల శనగ పిండికి ఒక చెంచా నిమ్మరసం,  పాలు అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు. దీన్ని ముఖం, మెడ,  చేతులు,  కాళ్ళపై అప్లై చేయాలి.  వృత్తాకారంలో  సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ స్క్రబ్‌ను చర్మంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.


శనగ పిండి, దోసకాయ..

ఈ స్క్రబ్ తయారు చేయడం చాలా సులభం. స్క్రబ్ చేయడానికి, దోసకాయ రసాన్ని 2 చెంచాల శనగ పిండిలో కలపాలి. ఇందులో  కొన్ని చుక్కల నిమ్మరసం జోడించాలి. ఈ పేస్ట్‌ను బాగా మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. లైట్ స్క్రబ్ తీసుకున్న తర్వాత చర్మంపై సుమారు 20 నుండి 25 నిమిషాలు   అలాగే ఉంచి ఆపై దానిని కడగాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అయినా చర్మంపై రాసుకుంటే, ట్యానింగ్‌ను తగ్గించడంలో ప్రభావం కనిపిస్తుంది.


                                                         *రూపశ్రీ.