కంఠం మీద నాలుకతో రాశాడు - సముద్రంలోని నీలిమ అంతా ఘనీభవించినట్లు నరాలు పొంగాయి.
    
    ఎద మీద తన చెంపను వుంచాడు. మాధుర్యపు తుట్టెను కదిపినట్లయింది.
    
    అక్కడి నుంచి కిందకు పాకి బొడ్డులో నాలుకను జొనిపాడు. స్వర్గం ముందున్న కందకంలో దిగినట్లనిపించింది. ఆపై చీర కుచ్చిళ్ళతో ముఖాన్ని గుచ్చాడు. సుఖం లోతెంతో తెలిసింది.
    
    అంతకు ముందెప్పుడూ అనుభవంలోకి రాని ఉద్రేకం, క్రితం ఎన్నడూ చవిచూడని ఉద్వేగం అతన్ని ఊపేశాయి. వేళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. అడ్డంకులన్నీ పూర్తిగా తొలగించడానికే అవి వున్నట్లు వేగంగా కదులుతున్నాయి.
    
    ఆమె దాదాపు నగ్నంగా తయారయింది.
    
    అతను కొద్దిగా పైకి లేచాడు.
    
    సరిగ్గా అదే సమయంలో తలుపు చప్పుడయింది. ఇద్దరూ అలా ఫ్రీజ్ అయిపోయారు.
    
    తలుపును ఎవరో బలంగా కొడుతున్నారు.
    
    ఆమె ముందుగా తేరుకుంది. బట్టలన్నీ ఒక్క క్షణంలో సర్దుకుంది.
    
    "ఎవరో వచ్చినట్లున్నారు" చాలా మెల్లగా అన్నా అందులో కంగారుంది.
    
    "ఎవరై వుంటారు?"
    
    "ఏమో!"
    
    మళ్ళీ తలుపు చప్పుడయింది. ఇక తప్పదన్నట్లు ఆమె లేవబోయింది.
    
    "నువ్వొద్దు! నేను వెళ్ళి చూస్తానులే"
    
    "అలానే! ముందు నువ్వెళ్ళు"
    
    అతను పైకి లేచి క్రాఫ్ సర్దుకుని ముఖం మీద వాలిన చెమట పొరను తుడుచుకుని తలుపు దగ్గరికి నడిచాడు.
    
    అక్కడ లైన్ లో నిలుచుని అసహనంగా చూస్తున్న సత్యనారాయణ రావుగారు, ఆయన భార్య, తల్లి, ముగ్గురు కూతుర్లూ తన ప్రాణాన్ని తీసుకుపోవడానికి వచ్చిన యమదూతల్లా అనిపించారు అతనికి.
    
    సిగ్గు, లజ్జ తప్పు చేస్తూ దొరికిపోయామన్న గిల్టీనెస్ ఓ క్షణంపాటు అతన్ని కదలనివ్వలేదు.
    
    అంతలో సుజన కూడా వచ్చింది.
    
    తల్లిదండ్రుల్నీ, అక్కయ్యలను చూడగానే ఏం జరిగివుంటుందో సగం అర్ధమైంది.
    
    వాళ్ళ వెనుక గుండ్రాయిలా అనిపిస్తున్న తాతయ్య కనిపించగానే పూర్తిగా అర్ధమైంది.
    
    అప్పటికే ఆలస్యం అయిపోయిందని గ్రహించిన ఆమె తలుపు బోల్టు తీసింది.
    
    "ఏంటమ్మా ఇంత ఆలస్యం?" ఆమెవైపు, అల్లుడివైపు అనుమానంగా చూస్తూ అడిగాడు సత్యనారాయణ.
    
    ఉమ ఒక్క ఉదుటున చెల్లెలివైపు గెంతి -
    
    "ఏమే! కొంపదీసి ఫస్ట్ నైట్ అయిపోయిందా ఏమిటి?" అని చెవిలో నోరు పెట్టి గొణిగింది.
    
    "లేదులేవే! ఇంకాసేపు మీరు రాకుండా వుండుంటే చాలెంజ్ లో నెగ్గుండేవాళ్ళం. కానీ ఖర్మ - మా వంశీ రెండో ప్లాన్ కూడా ఫెయిల్ అయింది."
    
    కూతుళ్ళిద్దరూ గుసగుసలు ఆడుతుండడం వల్ల సత్యనారాయణ తను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పమన్నట్లు అల్లుడివైపు చూస్తుండిపోయాడు.
    
    "ఇప్పుడే వచ్చానండీ ఇంతలో సుజన వేదాంతం దాని విశిష్టత గురించి చెప్పమంటే ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాను - ఇంతలో మీరొచ్చారు" వంశీ తడుముకోకుండా నోటికొచ్చిన అబద్దం చెప్పాడు.
    
    ఛాలెంజ్ లో సుజన గెలవలేదని ఉమ తన చెల్లెళ్ళవేపు చూస్తూ సైగ చేసింది.
    
    అంతలో బామ్మా ముందుకొచ్చి వంశీతో చెప్పింది.
    
    "చూడు బాబు! పిదపకాలం, మా కాలంలో ఇలాంటి మోసాలు, కుట్రలూ ఎరుగుదుమా! నా తమ్ముడు వీడు-వీడు చచ్చిపోయినట్లు ఎవరో ఆకతాయి కుర్రాడు టెలిగ్రామ్ ఇచ్చాడు. అది నిజమేననుకుని మేం బయల్దేరివెళ్ళాం.
    
    తీరా నెల్లూరు బస్టాండులో దిగి రాజులపాలెం బస్ కోసం ఎదురు చూస్తూ వుంటే, మా తమ్ముడు దిగాడు.
    
    వాడు ఇక్కడికే రావడానికిబయల్దేరాడట. అందరం కలుసుకునే వస్తున్నాం"
    
    ఆమె ఇంకా చెబుతూనే వుంది.
    
    తన పథకం ఎక్కడ బెడిసికొట్టిందో అర్ధమైంది వంశీకి.
    
    చచ్చిపోయినట్టు తను ఇచ్చిన మనిషే ఇక్కడికి బయలుదేరి నెల్లూరులో కనిపించడం వల్ల వచ్చిన చిక్కు ఇది.
    
    ఈయనగారు ఈరోజే ఇక్కడికి రావడానికి బయల్దేరాలా?
    
    ఒరేయ్ వంశీ! నీకు అదృష్టం కలిసి రాలేదురా అని తనకు తనే సర్ది చెప్పుకుని అక్కడనుంచి తేలుకుట్టిన దొంగలా నిశ్శబ్దంగా అడుగువేయబోయాడు.
    
    మామ కంఠం కోపంలో బాగా కాలి ఖంగున మోగడంతో ఆగిపోయింది.
    
    "ఇదంతా చేసింది ఎవరో నేనూ ఊహించగలను మద్రాస్ లోని చిట్టిబాబే ఇంత నికృష్టానికి పాల్పడి వుంటాడు. సబ్ ఇన్ స్పెక్టర్ శరవణన్ తో చెప్పి ఈసారి వైడ్కి సరిగ్గా బుద్ది వచ్చేట్టు చేస్తాను" అంటూ ఆవేశంలో ఊగిపోతున్నాడు.    
    
    పోలీసు అధికారి అయిన శరవణన్ మద్రాసు నుంచి తమ పెళ్ళికి రావడం, ఊరెళుతూ తనతో అన్న మాటలు టక్కున గుర్తుకొచ్చాయి వంశీకి.
    
    ఇప్పుడు తన మామయ్య చెప్పిన చిట్టిబాబుకి తమ పెళ్ళితో ఏదో లింక్ వుండి వుంటుందనిపించింది.
    
    అయితే ఆ లింక్ ఏమిటో ఊహకయినా అందడం లేదు.
    
    అందుకే ప్లాట్ గా చూస్తూ వుండిపోయాడు.
    
    అది గమనించిన సత్యనారాయణరావుకి తన తప్పు ఏమిటో తెలిసింది.
    
    ఏదో ఆవేశంలో చిట్టిబాబు పేరెత్తాడు గానీ గొడవంతా అల్లుడికి తెలిస్తే ముప్పు ఊహించలేక కాదు.
    
    ఇప్పటికయినా తన తప్పును సరిదిద్దుకోవాలని అల్లుడివైపు తిరిగి...
    
    "చిట్టిబాబు మా బంధువుల అబ్బాయి. ఒట్టి ఆకతాయి వెధవ. ఏదో సరదాగా ఇలా టెలిగ్రామ్ ఇచ్చి వుంటాడు" అని చెప్పాడు.
    
    ఆయన ముఖంలో కనిపిస్తున్న కంగారుని పసికట్టాడు వంశీ. తనకు తెలియకుండా ఏదో విషయాన్నీ మామయ్య దాస్తున్నాడని గ్రహించాడు.
    
    అంతవరకు వంశీ కరెక్టే!
    
                                                            *    *    *    *    *
    
    "సుజనా! ఏమిటి నువ్వడుగుతోంది? నా ఫస్ట్ నైట్ గురించి చెప్పాలా?"
    
    సుజన అలా అడుగుతుందని మాలిని ఊహించలేకపోయింది. మొదటిరాత్రి ఏం జరిగిందో చెప్పమని ఎవరూ అడగరు తమ శోభనాన్ని గురించి మరొకరికి చెప్పాల్సిన అవసరం కూడా రాదు.
    
    అందుకే ఆమె నమ్మలేనట్లు మరోసారి అడిగింది.
    
    కుషన్ కుర్చీలో గోధుమపంట చేలు ఒదిగిపోయినట్లు ఆమె మెరిసిపోతోంది.