1. మృదువైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందాలనుకుంటే ముఖం, మోకాళ్ళు, మరియు మోచేతులకు నిమ్మరసాన్ని అప్లై చేయాలి. ఇంకా నిమ్మ తొక్కలను ఉపయోగించి చర్మం మీద రుద్దడంవల్ల నేచురల్ టానిక్ లా పనిచేస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
2. మిల్క్ క్రీమ్ మరియు తేనె, నిమ్మరసంను మిక్స్ చేసి, ఈ నేచురల్ లిప్ బామ్ ను పెదాలకు రాయడం వల్ల పెదాలకు మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. మరియు ఇది పగుళ్ళను నివారిస్తుంది.
3. నిమ్మరసం మొటిమలను నివారించడంలో మరియు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా ఉంచుతుంది.
4. నిమ్మరసం, వేడినీళ్ళతో తీసుకొన్నప్పుడు, శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఇది మీ శరీరంలోని క్యాలరీలన్ కరిగించడానికి మరియు బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
5. నిమ్మరసం చెడు శ్వాస(చెడు వాసనను) దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా పళ్ళ నొప్పులను నుండి మరియు చిగురు వాపులను నుండి ఉపశమనం కలిగిస్తుంది. తెలుపు మరియు మెరిసే దంతాలు పొందడానికి నిమ్మతొక్కతో చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి పళ్ళు రుద్దాలి.
6. చంకల్లో నలుపుదనాన్ని తగ్గించడం కోసం కొన్ని చుక్కల నిమ్మరసంలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి లేదా నిమ్మకాయను మద్యకు కట్ చేసి, మీ చంకల్లో రుద్దాలి. అంతే డార్క్ చర్మం కాస్త కాంతివంతంగా మారుతుంది.
7. కొంత నిమ్మరసంలో మీ వేళ్ళను డిప్ చేయడం వల్ల మే చేతి వేళ్ళు బలంగా మారడం జరుగుతుంది. మరియు ఇది గోళ్ళ యొక్క డల్ నెస్ మరియు పసుపు వర్ణంను తొలగించడానికి సహాయపుడుతుంది.
8. నిమ్మతొక్క లేదా నిమ్మరసంతో తల మాడుకు మర్ధన చేయాలి. మర్ధన చేసిన తర్వాత కొన్ని నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
9. ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీరంలో అనవసరమైన వ్యర్థాన్ని విషాన్ని బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ మెరిసేటటువంటి చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.