రెండు కప్పుల నీళ్ళకు, ఒక కప్పు ఆపిల్ సిడర్ వెనిగర్ ను, ఒక స్పూను రోజ్ వాటర్ ను కలిపి ఒక సీసాలో వేసి ఉంచండి. తల స్నానం చేసేటపుడు దీనిని కండిషనర్ గా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల త్వరగా ముడతలు పడకుండా ఉపయోగపడుతుంది.

 

చెంచా బొప్పాయి గుజ్జు, మరో చెంచా మామిడి గుజ్జు కలిపి ఆ మిశ్రమానికి రెండు చెంచాల గంధం పొడి, ఒక చెంచా తేనే కలిపి దానిని ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి రాసుకోవాలి. పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

 

రెండు చెంచాల ద్రాక్ష రసం, రెండు చెంచాల కలబంద రసం కలిపి ముఖానికి రాసుకోండి. ఇందులో కొంచెం టమాటో రసం కలిపినా కూడా మంచిదే. దీనిని తరచూ ముఖానికి రాసుకుంటే చర్మంపై ముడతలు రావడం తగ్గుతుంది.