డీప్ నెక్ దుస్తుల గురించి ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలివి..!

మొదటిసారి డీప్ నెక్ డ్రెస్ లేదా బ్లౌజ్ ధరించాలని అనుకునేవారు చాలా గందరగోళం ఫీలవుతారు. దీన్ని ధరించడానికి కొన్ని పద్దతులు, చిట్కాలు ఉన్నాయి. అవి తెలుసుకోకుండా డీప్ నెక్ దుస్తులు ధరిస్తే ఆ తరువాత అమ్మాయిలు బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. అదే చిట్కాలతో డీప్ నెక్ డ్రెస్సులు ధరిస్తే చాలా ఆకర్షణీయంగా మారతారు.
కొన్నిసార్లు డీప్ నెక్ డ్రెస్ ధరించడం వల్ల ఫ్యాషన్ సెలక్షన్ తప్పుగా ఉండటం లేదా ఫిట్టింగ్ చేయడం వల్ల అసౌకర్యంగా అనిపించడం వంటివి జరుగుతాయి. అందువల్ల కంఫర్ట్ గా ఉండటానికి, లుక్ కూడా సూపర్భ్ గా కనిపించడానికి మొదట్లోనే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మొదటిసారి డీప్ నెక్ డ్రెస్ లేదా బ్లౌజ్ ధరించే అమ్మాయిలకు చాలా హెల్ప్ అయ్యే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే..
లో దుస్తుల ఎంపిక..
లో దుస్తుల ఎంపిక చాలా ముఖ్యమైన అంశం. లో నెక్ ధరించేటప్పుడు ఇన్నర్‌వేర్ పదే పదే బయటకు వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇందుకోసం డీప్ నెక్ బ్రా, ప్లంజ్ బ్రా లేదా సిలికాన్ బ్రాను ఉపయోగించాలి. తద్వారా స్ట్రాప్ బయటకు కనిపించదు. లుక్ చక్కగా కనిపిస్తుంది. స్ట్రాప్ బయట కనిపించినప్పుడు, దాన్ని మళ్లీ మళ్లీ సరిచేయడంలో గందరగోళానికి గురవుతారు.
ఫిట్టింగ్..
లో నెక్ బాగా ఫిట్ అయినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. తప్పుగా అమర్చిన డ్రెస్ లేదా బ్లౌజ్ చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ముందు వైపు వదులుగా ఉంటే, అది లేవడానికి లేదా కూర్చోవడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి సరైన ఫిట్టింగ్ గురించి జాగ్రత్త వహించాలి.
ప్యాషన్ టేప్..
లో నెక్ డ్రెస్ ను పర్ఫెక్ట్ గా చేసుకోవడానికి ఫ్యాషన్ టేప్ ఉపయోగించవచ్చు. ఫ్యాషన్ టేప్ డ్రెస్ ను స్కిన్ పై సెట్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది డ్రెస్ ను స్టేబుల్ గా ఉంచుతుంది. ఎప్పుడైనా డ్రస్ వల్ల నలుగురిలో ఇబ్బంది ఎదురైనప్పుడు అయ్యో అని ఫీలవ్వాల్సిన పని ఉండదు.
స్కిన్ కేర్..
లో నెక్ బ్లౌజ్ లేదా డ్రెస్ వేసుకుంటే ముఖం లాగా మెడ, ఛాతీ ప్రాంతాన్ని క్లీన్ చేసి మాయిశ్చరైజ్ రాసుకోవాలి. తద్వారా డ్రెస్ తో మెరుస్తూ ఉంటారు. చర్మం అస్సలు పొడిగా కనిపించకూడదని గుర్తు పెట్టుకోవాలి. ఇది లుక్‌ను పాడు చేస్తుంది.
కాన్పిడెంట్..
డీప్ నెక్ లాంటి దుస్తులు ధరించేటప్పుడు బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనవి. ఆత్మవిశ్వాసం లేకపోతే ఈ డ్రెస్ లు ధరించినప్పుడు ఏదో ఇబ్బంది ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీని వల్ల నలుగురిలో సరదాగా ఉండలేరు. పైగా కొన్నిసార్లు నవ్వులపాలయ్యే అవకాశం కూడా ఉండవచ్చు.
*రూపశ్రీ.


.webp)
