గో-సి ఫ్యాషన్ గురించి మీకు తెలుసా...

 

 

గో-సి ఫ్యాషన్ .. పేరు చదవగానే మన తెలుగోళ్లు పిచ్చగా నవ్వుకుని ఉంటారు.  మన పెద్దోళ్లు ఎప్పుడో గోచిలు పెట్టుకుని బ్రతికేశారు కదా.. ఇప్పుడు మళ్లీ అదే కొత్తగా ఫ్యాషన్ లా వచ్చిందా ఏంటి అని బుగ్గలు నొక్కుకోనక్కర్లేదు. అసలు దానికి దీనికి సంబంధమే లేదండోయ్.. ఇది పూర్తీగా వేరే వర్గానికి చెందినది. మరైతే అసలు ఈ గో-సి ఔట్ ఫిట్ అంటే ఏంటి? దీనికి ఫ్యాషన్ ట్రెండ్ కు సంబంధం ఏంటి? అనే సందేహం వచ్చిందా? అయితే ఇప్పుడే గో-సి ఔట్ ఫిట్ గురించి  తెలుసుకోండి.

గో-సి ట్రెండ్..

 గో-సీ అంటే ఏ సందర్భానికైనా సరిపోయే దుస్తులు. ఈ దుస్తులు చాలా ఫార్మల్ గా లేదా చాలా క్యాజువల్ గా ఉండవు. కంప్లీట్ బ్యాలెన్డ్ దుస్తులివి. గో-సీ ట్రెండ్ వాస్తవానికి మోడలింగ్,  నటన పరిశ్రమ నుండి వచ్చింది. ఇక్కడ యాక్టర్స్ లేదా మోడల్స్ ఏదైనా ఆడిషన్ లేదా సమావేశం కోసం గో-సీ లుక్ లో వెళ్తారు. మరో మాటలో చెప్పాలంటే వారు ధరించే దుస్తులు అటు ప్రొఫెషనల్ గానూ.. ఇటు క్యాజువల్ అనుకునే విధంగానూ ఉంటాయి. పైగా ఇవి చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి.  ఇలా అన్ని విదాలుగా అనుకూలంగా ఉన్న దుస్తులు ధరించడాన్ని గో-సి ట్రెండ్ అంటారు.

ఇప్పుడు ఈ గో-సి ట్రెండ్ సాధారణ మహిళలలో కూడా  కనిపిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌లో సాధారణ లుక్‌తో ఉంటూ ట్రెండీగా కనిపించాలనుకునే మహిళల్లో.  మహిళలు సౌకర్యం,  శైలి రెండింటినీ సమతుల్యం చేసుకోవాలనుకున్నప్పుడు గో-సీ ఫ్యాషన్ సాధారణ మహిళలకు కూడా ఎంపిక అయ్యింది.

గో-సి ట్రెండ్ కు కొన్ని కలర్స్, కొన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి.  అవి - బేసిక్ న్యూట్రల్ కలర్ టాప్స్, రౌండ్ నెక్ వంటి నెక్ స్టైల్స్, V నెక్ లేదా టర్టిల్ నెక్ వెర్షన్, స్ట్రెయిట్ లేదా స్లిమ్ ఫిట్ ప్యాంట్లు, క్వాలిటీ బ్లేజర్ లేదా జాకెట్, కో-ఆర్డ్ సెట్లు, లినెన్ లేదా కాటన్‌లో స్ట్రక్చర్డ్ జాకెట్, న్యూట్రల్ స్నీకర్లు, లోఫర్లు లేదా స్లైడ్ చెప్పులు, యాక్సెసరీలలో సాలిడ్ బ్యాగులు, సింపుల్ గోల్డ్ లేదా సిల్వర్ జ్యువెలరీ,  వాచ్.

లక్షణాలు ఇవే..

 సింపుల్ గా ఉంటూ సౌకర్యవంతమైన డిజైన్లు గో-టు అవుట్‌ఫిట్‌లలో కీలకం. వాటిలో స్ట్రెయిట్ ప్యాంట్లు, బేసిక్ నెక్‌లైన్‌లు,  మోనోక్రోమ్ లేదా మైక్రో ప్రింట్లు ఉంటాయి. ఈ అవుట్‌ఫిట్‌లు ఆఫీసులో లేదా నైట్ పార్టీలో అయినా, రోజంతా ధరించడానికి బాగుంటాయి. యాక్సెసరీలు, జాకెట్లు లేదా ఫుట్‌వేర్‌తో వాటిని సులభంగా డిఫరెంట్ రూపాల్లోకి మార్చవచ్చు. ఇది వాటిని డిపరెంట్ గా కనిపించేలా చేస్తుంది. సింపుల్,  క్లాసిక్ స్టైల్స్ ఎక్కువ కాలం ఉంటాయి.  అవి అంత తొందరగా కనుమరుగయ్యేయి కూడా కాదు.  మళ్లీ మళ్లీ ధరించవచ్చు కూడా. ఇటువంటి దుస్తులు ట్రెండీగా ఉండటమే కాకుండా మన్నికగా కూడా ఉంటాయి.

గో-సి ట్రెండ్ గురించి చెప్పుకున్నప్పుడు చాలా వరకు ఒత్తిడి కూడా దానికదే తగ్గిపోతుంది. దీనికి కారణం.. గో-సి ట్రెండ్ లో దుస్తులు ఎలాంటి సందర్భానికైనా సరిపోవడమే. అంటే ఈ గో-సి ఫ్యాషన్ లో ఉన్న దుస్తులు ఎప్పుడైనా వేటికైనా సరిపోతాయి.  ప్యాషన్ గురించి,  ట్రెండ్ గురించి,  అందంగా కనిపించడం గురించి ఆలోచించి కంగారు పడిపోవాల్సిన అవసరం అస్సలు ఉండదు.  కాబట్టి గో-సి ప్యాషన్ ను పాలో అవుతూ ఉంటే భిన్న రకాల ఈవెంట్లను గుర్తు తెచ్చుకుని టెన్షన్  పడాల్సిన అవసరమే ఉండదు.  అందుకే మీరూ ఓ లుక్కేయండి గో-సి ఫ్యాషన్ మీద.

                                *రూపశ్రీ.