ఇంట్లోనే పెడిక్యూర్ మానిక్యుర్
అందమైన చేతులు పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ ఇంక మానిక్యుర్ చేయించాలి. పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.
గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, డెటాల్, షాంపూ వేయాలి. అందులో 15 నుంచి 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిస్ స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి. తరువాత ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. కాళ్ళకు సాక్స్ వేసుకోవాలి.
- ఇలా చేయడం వల్ల పగుళ్లు,దురద రాకుండా ఉంటాయి.
- సాల్ట్ కాళ్ల నొప్పులను నివారిస్తుంది.
- హైడ్రోజన్ పెరాక్స్ డ్ /డెటాల్ పగుళ్లలోపల ఉన్న మురికిని తొలగిస్తాయి.
- నిమ్మచెక్క,గ్లిజరిన్ వల్ల టాన్‌తో నల్లగా మారిన పాదాలు తిరిగి మునుపటి కాంతిని ఇస్తుంది
-చలికాలంలో రోజంతా సాక్స్ వేసుకుని ఉండటం మంచిది.
చేతులను మృదువుగా ఉంచడానికి ఉప్పు, డెటాల్, షాంపూ కలిపిన గోరు నీటిలో చేతులను కూడా నానబెట్టాలి.
తరువాత మెత్తటి బ్రష్‌తో మృదువుగా రుద్ది క్లీన్ చేయాలి. అనంతరం శనగపిండి, పాలు, కస్తూరి పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో చేతులను స్క్రబ్ చేయాలి.
కడిగిన తరువాత నిమ్మచెక్కపై గ్లిజరిన్ వేసి రుద్దాలి. ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. చేతులు డ్రై అయిపోకుండా ఉండాలంటే బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గ్లోవ్స్ వేసుకోవాలి.