ప్రపంచంలో ప్రతి ఒక్క మహిళ కూడా హీరోయిన్ లాగా ఉండాలనే అనుకుంటుంది. కానీ ఎక్కడా? ఆ అందం అందరికి రాదు కదా. అలా అందంగా కనపడాలని మొహంపై ఎక్కువగా క్రీమ్స్ రాయడం వలన మొదట్లో బాగున్నా, పోను పోను మొహంపై అక్కడక్కడ నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలను గిచ్చేసి, గోకేసి మొహాన్ని మరింత చెత్తగా చేసుకోకుండా, వంటింట్లోనే ఉండే వస్తువులతో మచ్చలను తొలగించేసి, మొహాన్ని కాంతివంతంగా ఎలా మార్చుకోవాలో ఈ క్రిందనున్న చిట్కాలను చదివి తెలుసుకోండి.
1. అలోవేరా(కలబంద)ను వాడటం వలన మీ చర్మంపై ఉండే మొటిమలు మచ్చలు పోయి, మొహం కాంతివంతంగా కనిపిస్తుంది.
2. వేల్లుల్లిలో ఎక్కువ ఘటుదనంతో పాటు, సల్ఫర్ కూడా ఉండడం వలన చర్మంపై ఉండే నల్లని మచ్చలకు విరుగుడుగా పని చేసి, ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది.
3. ఏ కాలంలో అయిన వాడె ఏకైక వస్తువు తేనే. ఈ తేనే వలన చర్మం, జుట్టు వంటి వాటికే కాక.. మొహాన్ని కూడా కాంతివంతంగా తయారుచేస్తుంది.
4. నిమ్మరసం జిడ్డును కోరికేస్తుంది. దీనివల్ల మొహం పైన ఉండే జిడ్డు మరియు నల్లని మచ్చలను తొలగించేసి మంచి రంగును అందిస్తుంది.
5. ఆలుగాద్దను బాగా దంచితే వచ్చే రసాన్ని నల్లటి మచ్చలపై పూసి మర్దనా చేయడం వలన నల్లటి మచ్చలు కనిపించకుండపోతాయి.
6. ఉల్లిపాయలను బాగా దంచి, ఆ పేస్ట్ ను నల్ల మచ్చలపై రాస్తే.. మచ్చలు పోయి, మొహం మెరిసిపోతుంది.