ముఖంలో మృతకణాలు పోయి మృదువు,కాంతివంతంగా ఉండటానికి చిట్కాలు
కొంచెం పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి మృదువుగా ఉంటుంది.
పావు చెంచా పాల పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. పది నిమషాలయ్యాక చల్లటి నీళ్ళతో కడిగి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
కమలాఫలంతోలును ఎండబెట్టి పొడి చేసి అందులో తగినంత పెరుగు కలిపి మిశ్రమంలా తయారు చేసి ముఖం, మెడకు పూట వేసి పావుగంటయ్యాక కడిగేస్తే మేను నిగారింపు సొంతం చేసుకుంటుంది.
రెండు చెంచాల నిమ్మరసంలో అరచెంచా తేనె కలిపి ఒంటికి రాసుకొని అరగంతయ్యాక స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది.