ఓర్పుకు పరీక్షపెట్టే కొన్ని రకాల కార్యకలాపాలలో పిల్లలు పాల్గొనేటట్లు చూస్తే, అన్నీ విషయాలలోనూ తొందరపడకుండా ఓర్పుగా వుండటం పిల్లలు అలవాటు చేసుకుంటారు. ఓర్పుకు పరీక్షపెట్టి వేచి ఉండే సమయంలో వాళ్ళకి లోకం గురించే తెలియజేసే హాబీలలో పిల్లలను ప్రవేశపెట్టాలి. అప్పుడు వారిలో ఓర్పు, నేర్పులు త్వరగా అలవడుతాయి.

ఉదాహరణకు... ఫజిల్స్ పూర్తి చేయటం, స్టాంపులు, నాణేలు సేకరించటం వంటి హాబీలను పిల్లలకు అలవాటు చేస్తే ... వారిలో నేమ్మదిగానైనా సహనం అలవడుతుంది. ఈ హాబీలలో వెంట వెంటనే రిజల్టు కనిపించదు కాబట్టి, వాటికోసం ఎదురుచూస్తారు. ఇది పిల్లలపై ఎంతో మంచి ప్రభావాన్ని చూపుతుంది. అదే విధంగా వారి ఆలోచన పరిజ్ఞానం కూడా మెరుగుపడుతుంది.