పిల్లలు ఊరుకోరంటూ చిన్నప్పుడు మనమే వారు అడిగినదల్లా వెంట వెంటనే కొనిస్తుంటాం. పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇపుడు తెలుసుకుందాం.

 

పిల్లలు ఏదైనా కొనివ్వమని మారం చేసినపుడు వెంటనే కొనివ్వకూడదు. ముందుగా వారికి వద్దని సర్దిచెప్పే ప్రయత్నం చెయ్యాలి. ఇలా కూడా వినకపోతే వారికి ఏదైనా పని చెప్పి, అది పూర్తి చేస్తేనే కొనిస్తాను అనే మాట ఇవ్వాలి. వాళ్ళు ఆ వస్తువు కోసం కచ్చితంగా ఆ పని చేసి తీరుతారు. లేదా అలా అడగడం మానేస్తారు.

 

ఒకవేళ ఆ పని గనుక మొత్తం పూర్తి చేస్తే మీరు కచ్చితంగా ఆ వస్తువును కొనివ్వాలి. అదే విధంగా చదువు విషయంలో కూడా ఇలాగే చేయాలి. ఏదైనా కోరుకుంటే.... ముందుగా పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇస్తానని మాటివ్వాలి. ఒకవేళ పాసైతే ఆ వస్తువును కొనివ్వాల్సిందే.

ఇలా చేయడం వల్ల మీ పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగి ఎలాంటి సమస్యలనైన ఎదుర్కునే మంచి పౌరులుగా తయారవుతారు. మరి మీకు ఇంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి.