మెడ బ్యూటీకి మెథడాలజీ



ముఖం తెల్లగా వున్నా, మెడ కొంచెం రంగు తక్కువగా కనిపిస్తుంది. ఒబెసిటీ, హార్మోన్లలో మార్పులు దీనికి కారణం అంటున్నారు నిపుణులు.  అయితే చిన్న చిన్న చిట్కాలతో ఆ నలుపును కొంతవరకు తగ్గించుకోవచ్చు.

1. రోజూ కాసేపు గోరువెచ్చని నీటిలో బట్టని ముంచి నీటిని పిండేశాక దాన్ని మెడపై వేసుకోవాలి. ఇలా చేస్తే మెడ దగ్గరి చర్మానికి ఆవిరి అంది నలుపు తగ్గుతుంది.

2. కొబ్బరి నూనె మెడ దగ్గరి నలుపుని పోగొట్టడంలో సమర్థంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ కొంచెం నూనెని మెడ చుట్టూ నెమ్మదిగా రాస్తూ వుంటే నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.

3. మెంతి ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొంచెం శనగపిండి కలిపి మెడకి పట్టించాలి. ఆరాక కడిగి, గోరువెచ్చని టవల్‌ని కాసేపు మెడమీద వుంచాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మెడ దగ్గరి చర్మం మృదువుగా మారుతుంది.

4. టమాటా, బీన్స్‌ని కలిపి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని మెడకి రాసుకున్నా మంచి ఫలితం వుంటుంది.

5. వారానికి ఒకసారి అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసి అందులో అందుబాటులో వున్న ఏదైనా మరో పండు గుజ్జుని కలిపి మెడకి పట్టించి ఆరాక నలుగు పిండితో రుద్దుకుని గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు... మెడ దగ్గరి చర్మం మృదువుగా మారుతుంది.

వీటితోపాటు ప్రతీరోజూ బయటి నుంచి రాగానే కొంచెం పచ్చిపాలతో మెడని రుద్దుకుంటే ఎప్పటికప్పుడు మురికి వదిలి మెడ తాజాగా వుంటుంది.

-రమ