క్యారట్ తో కాంతివంతమైన చర్మం

 


క్యారట్ లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా సహజ మెరుపుతో ఉంచుతాయి. అందుకే క్యారట్ ని సౌందర్య పోషణలో భాగంగా తరుచూ వాడుతుంటే వయసుతో పాటు వచ్చే మార్పు ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. క్యారట్ తో వివిధ రకాల ఫేస్ ప్యాక్స్......ఇవి

* క్యారట్ ని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేయాలి. రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించి ఓ పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి... మెత్తటి బట్టతో పొడిగా తుడవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతివంతమవుతుంది.

* మెహం మీద  ముడతలుంటే క్యారట్ గుజ్జులో తేనెతో పాటు కాస్త బాదం నూనె కూడా కలిపి మాస్క్ వేసుకుంటే మంచి ఫలితముంటుంది.

* ఒక క్యారట్ ని మెత్తగా గ్రైండ్ చేసి దానికి మూడు చెంచాల పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, అరచేతి వెనుకభాగాలకి పట్టించి చిన్నగా రుద్దితే మృతకణాలు తొలిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

* క్యారట్ చెక్కుతీసి ఓ గాజుసీసాలో పెట్టి... ఆక్యారట్ మునిగే వరకు కొబ్బరి నూనె వేయాలి. రెండు రోజుల పాటు ఎండలో పెట్టి ఆతర్యాత నూనెని వడకట్టి రోజూ ముఖానికి రాసుకుంటే చర్మం తేమను సంతరించుకుంటుంది.

-రమ