అల్లంతో తలనొప్పి దూరం
ఈ వేసవి ఎండలు బైటకి వెళ్ళాలంటే భయమేసేలా ఉన్నాయి. కాని వెళ్ళక తప్పదు అనేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. బైట తిరిగినప్పుడు ఎలా ఉన్నా ఇంటికి రాగానే మొదలవుతుంది తలనొప్పి. ఇక ఆ తలనొప్పితో ఇంట్లో మిగిలిన పనులన్నీ పెండింగ్ లో పడిపోతాయి. ఇలాంటి తలనొప్పుల కోసం టాబ్లెట్ లు వేసుకోవటం అవసరమా అంటే అస్సలు అక్కర్లెద్దని చెప్తున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. వేసవిలో వచ్చే ఇలాంటి తలనోప్పులకి ఇంట్లో దొరికే వాటితోనే సులువుగా పరిష్కారం దొరుకుతుందట. అవేంటో చూసేద్దామా.
మనం ఎక్కడికైనా వెళ్లి రాగానే ముందుగా చెయ్యాల్సిన పని చల్ల నీళ్ళతో మొహం మీద ఫోర్సుగా కొట్టుకోవటం. ఇలా చన్నీళ్ళతో మొహం మీద చల్లడం వల్ల చాలా రిలీఫ్ గా ఉంటుంది. లేదా 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 1/2 కప్పు పాలల్లో వేసి రెండు నిమిషాలు మరిగించి తేనేతో కలిపి తాగితే తలనొప్పి మాయం అవుతుందిట.
అల్లం తలనోప్పులకి మంచి ఔషధంలా పనిచేస్తుందని చెప్తున్నారు వైధ్యులు. మనం ఇంట్లో టీ తయారుచేసుకునేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్క దంచి వేసుకుని టీ తాగితే నొప్పి క్షణాల్లో మటుమాయం అవుతుందిట.
మనకి సులువుగా లభ్యమయ్యే పండు ఆపిల్. ఉదయాన్నే ఆపిల్ ముక్కాలా మీద ఉప్పు జల్లుకుని తినటం వల్ల ఎండలో తిరిగిన తలనొప్పి వచ్చే సూచనలు తక్కువగా ఉంటాయి.
ఎక్కువగా ఎండల్లో తిరగాల్సి వచ్చే వాళ్ళు తలకి రోజ్ మేరి ఆయిల్ తో మర్ధనా చేసుకుంటే నొప్పి తొందరగా పోతుందిట. కళ్ళు కూడా చల్లబడి మంచి రిలీఫ్ గా ఉంటుంది.అలాగే లేవండర్ ఆయిల్ కూడా ఇలాంటి తలనోప్పులకి బాగా
తులసి తలనోప్పులకి ఇంట్లో దొరికే పరమౌషధం. అందరి ఇళ్ళల్లో తులసి ఉంటూనే ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు టీలో తులసి ఆకులు వేసుకున్నా పరవాలేదు,లేదా మార్కెట్ లో దొరికే తులసి నూనేని తలకి పట్టించినా ఉపశమనం లభిస్తుంది.
ఎండాకాలంలో తలనొప్పితో బాధపడేవాళ్ళు నీళ్ళు ఎక్కువుగా తాగుతూ ఉండాలి. దీని వల్ల మంచి పరిణామాలు ఏర్పడతాయి. అలాగే కాఫీ టీ లు, చాక్లెట్ లు, వెన్నతో చేసిన పదార్థాలు కాస్త తగ్గిస్తే మంచిదట.
అల్లం రసం తేనే రెండిటిని సమానంగా కలుపుకుని రోజులో రెండు సార్లు తాగితే ఎలాంటి మొండి తలనోప్పులయినా పోతాయట. లేదా అల్లం పొదిలో కాస్త నీళ్ళు కలిపి పేస్టు లా చేసి నుదిటికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
కొన్ని గంటల వరకూ ఏమి తినకుండా అలాగే గడపటం, లేదా పనిచేయడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. అందువల్ల ఎక్కువసేపు కడుపు ఖాళీగా లేకుండా చూసుకుంటే చాలు ఎలాంటి తలనొప్పులు మీ దగ్గరకి రావు. వేసవిలో మనం తీసుకునే కొద్దిపాటి జాగ్రత్తలు చాలు ఎలాంటి రోగాలు మన దగ్గరకి చేరవు.
- కళ్యాణి