పొట్లకాయని చూసి పారిపోయే వ్యాధులు
ఒకప్పుడు వారంలో రెండు సార్లైనా పొట్లకాయతో కూర చేసేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పటిలా ఇంటర్నెట్లు, హెల్త్ వెబ్ సైట్స్ లేకపోయినా వాళ్ళకి అది తినటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో బాగా తెలుసు. రోజులు మారేసరికి కూరగాయల వాడకంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఈ రోజుల్లో పిల్లలు పొట్లకాయ తినటానికి అంతగా ఆశక్తి చూపించటం లేదు. దానికి కారణం అందులో ఎన్ని పోషకవిలువలు దాగి ఉన్నాయో తెలియకపోవటమే అయ్యుంటుంది.
పోట్లకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఎక్కువగా పీచుపదార్ధాలు ఉంటాయి. కేలరీలు అతి తక్కువగా ఉండటం వల్ల సన్నగా, నాజుకుగాతయ్యరవ్వాలనుకునేవారు దీనిని తప్పకుండా తినాలి. ప్రోటీన్లు సమృద్దిగా ఉండే ఈ కాయలో విటమిన్ ఏ,బి, సిలు తగిన పాళ్ళల్లో ఉంటాయట. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం కూడా ఉండటం వల్ల మంచి మినరల్ ఫుడ్ అని చెప్పచ్చు.
ఈ పోట్లకాయని ముఖ్యంగా ఎండా కాలంలో తినటం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది గుండెజబ్బులకి మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. ఈ పొట్లపాదు ఆకుల్ని ప్రాకృతిక వైద్యంలో ఎక్కువగా వాడతారట. ఎన్నో వ్యాదుల్ని నయం చేయటమే కాకుండా, కొన్ని జబ్బులు మన దగ్గరికి కూడా చేరనీయకుండా చేసే సామర్ద్యం ఉందిట పోట్లకాయలో.
పిలల్లో పైత్యం వల్ల వచ్చే జ్వరాలకు పొట్లకాయ ఒక దివ్యౌషదంలా పనిచేస్తుందట. పొట్లకాయ,కొత్తిమీర రసాన్ని బాగా మరిగించి కషాయంలా చేసి మూడుపూటల ఒక స్పూన్ చొప్పున పడితే జ్వరం తగ్గుముఖం పడుతుందిట. దీని ఆకులకి వాంతుల్ని అరికట్టే శక్తి కుడా ఉందిట.
పోట్లకాయ షుగర్ పేషంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఆహారంలో తీసుకోవటం వల్ల ఎక్కువగా దాహం వెయ్యకుండా ఉంటుందిట. దీనిలో ఉండే నీటి శాతం మనిషికి దాహం వేయకుండా చూస్తుందిట. టైప్ 2 డయాబెటిస్ లో శరీర బరువు తగాతంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె దడగా ఉన్నా, చాతిలో తరచూ నొప్పి వస్తున్నా పొట్లకాయ ఆకుల్ని రసంలా చేసి మూడుపూటలా 2 స్పూన్స్ చొప్పున ఇస్తే ఆ బాధ తగ్గుతుంది. పచ్చకామెర్లకు కూడా ఇదే చికిత్స మంచిదట.
మంచి జీర్ణక్రియ కోసం ఎండబెట్టిన పోట్లకాయతో చేసిన కషాయం ఒక మంచి మందులా పనిచేస్తుంది. పరగడుపునే ఈ కషాయం తాగటం ఇంకా ఉత్తమం. ఇన్ని ఉపయోగాలు దాగి ఉన్న పొట్లకాయని వేసవి కాలంలో మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుందాం.
..కళ్యాణి