జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే.. ఉసిరికాయలో ఇదొక్కటి మిక్స్ చేసి రాయాలి..!

 

జుట్టు అందంగా, ఆరోగ్యంగా  పెరగాలని కోరుకోని వారు ఉండరు. అయితే జుట్టు పెరుగుదల ఇప్పట్లో చాలా అరుదుగా కనిపిస్తోంది.  కొందరు జుట్టు పెరుగుదల జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంటారు. కానీ జుట్టు పెరుగుదలకు తగిన జీన్స్ ఉన్నా కొన్ని కారణాల వల్ల  జుట్టు పెరుగుదల సరిగా ఉండదు.  కాలుష్యం, ఆహారం సరిగా తీసుకోక పోవడం,  జుట్టు సంరక్షణ చర్యలు పాటించకపోవడం, జుట్టుకోసం చాలా హానికరమైన రసాయనాలున్న ఉత్పత్తులు వాడటం. ఇలా చాలా విషయాలు జుట్టు పెరగకపోవడానికి కారణం అవుతాయి. అయితే ఉసిరికాయలో ఒక్క పదార్థం మిక్స్ చేసి రాస్తే చాలు.. జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందట.

ఉసిరి, కొబ్బరినూనె..

ఉసిరికాయ పొడి సాధారణంగా హెన్నా, హెయిర్ మాస్క్ మొదలైన వాటిలో ఉపయోగిస్తుంటారు.  ఉసిరికాయ పొడిలో కొబ్బరినూనె కలిపి రాస్తే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుందట.  దీన్ని రెండు విధాలుగా రెఢీ చెసుకోవచ్చు.

ఉసిరి రసం, కొబ్బరినూనె..

తాజా ఉసిరికాయలు అందుబాటులో ఉన్నవారు దీన్ని ట్రై చేయవచ్చు.  ఉసిరికాయలను తురిమి రసం  తీసుకోవాలి.  ఈ రసానికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె తీసుకోవాలి.  ఈ రెండింటిని ఇనుప కడాయిలో వేసి సన్నని మంట మీద మరిగించాలి. రసం అంతా ఇగిరిపోయిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి.  నూనె చల్లారిన తరువాత గాజు సీసాలో పోసి భద్రపరుచుకోవాలి.  ఈ నూనెను తల స్నానం చేయడానికి గంట ముందు తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.  కుదిరితే నూనెను డబుల్ బాయిల్ పద్దతిలో వేడి చేసి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. గంట తరువాత గాఢత లేని షాంపూ లేదా శీకాయ లేదా కుంకుడుకాయ పొడితో తలస్నానం చేయాలి.  ఇలా చేస్తుంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  వారంలో రెండు సార్లు దీన్ని అప్లై చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఉసిరి పొడి, కొబ్బరినూనె..

తాజా ఉసిరికాయలు అందుబాటులో లేనప్పుడు ఉసిరికాయ పొడిని ఉపయోగించవచ్చు.  కల్తీ లేని ఉసిరికాయ పొడిని తీసుకుని అందులో సమాన పరిమాణంలో కొబ్బరి నూనె కలపాలి.  దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి.  ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. లేకపోతే ఉసిరికాయ పొడిలో కొబ్బరినూనె వేసి దీన్ని సన్నని మంట మీద ఉడికించి తరువాత వడగట్టి కూడా వాడవచ్చు.  ఉసిరికాయను ఇలా కొబ్బరినూనెతో కలిపి వాడుతుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. అయితే జుట్టు పెరుగుదలకు సహకరించే బయోటిన్, బీటా కెరోటిన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్-సి వంటివి ఉన్న ఆహారాలు. గుమ్మడి గింజలు పుష్కలంగా తీసుకుంటూ ఉండాలి.  ఇలా చేస్తే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.

                                                        *రూపశ్రీ.