అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు
అజీర్ణం, మలబద్ధకం వంటి కారణాలవల్ల చర్మం మీద దద్దుర్లు ఏర్పడుతుంటే పూటకు టీ స్పూన్ అల్లం రసాన్ని సమాన భాగం పాత బెల్లంతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి.
అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి నువ్వుల నూనెను, తేనెను, సైంధవ లవణాన్ని కలిపి 2-4 బిందువుల చొప్పున రెండు చెవుల్లోనూ రోజుకు 3-4సార్లు నొప్పి తగ్గేవరకూ వేసుకోవాలి.
రెండు టీ స్పూన్ల అల్లం రసంలో టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంకాలాలు రెండుపూటలా తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుంది.
రెండు చెంచాల అల్లం రసంలో చిటికెడు పిప్పళ్లు చూర్ణం, చిటికెడు సైంధవ లవణం (రాతి ఉప్పు) కలిపి రాత్రి పడుకునే సమయంలో వారంపాటు తీసుకుంటే ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి.
అల్లం రసాన్ని ముక్కు రంధ్రాల్లో నస్యంగావేస్తే తెలివి తప్పిపడిపోయిన వారికి తిరిగి స్పృహ వస్తుంది.
అల్లంకు సమాన భాగం బెల్లం కలిపి పూటకు రెండు టీస్పూన్ల మోతాదులో రెండుపూటలా తీసుకుంటే మూడు దోషాలు ఏక కాలంలో వికృతి చెందిన సందర్భాల్లో గుణం కనిపిస్తుంది.
అల్లాన్ని ముద్దగా దంచి దంతాల మీద, చిగుళ్ల మీద కొంచెం సేపు ఉంచుకుంటే జలుబులో దంతాలు లాగటం, జివ్వుమనడం వంటి సమస్యలు తగ్గుతాయి.
అల్లం రసాన్ని కొద్దిగా వేడిచేసి రెండు చెవుల్లోనూ 4-5 చుక్కల చొప్పున వేసుకోవాలి.
అల్లం రసాన్ని పూటకు 2 టీస్పూన్ల మోతాదులో తీసుకొని జీర్ణమైన తరువాత రెండుపూటలా ఉడికించిన బియ్యం, పాలు ఆహారంగా తీసుకోవాలి.
అల్లం రసాన్ని ఏడాదిపాటు నిల్వచేసిన నెయ్యిలో కలిపి ముద్దకర్పూరం కలిపి వేడిచేసి ఛాతిమీద ప్రయోగించి సున్నితంగా మర్ధనాచేస్తే న్యుమోనియాలో ఛాతి నొప్పి వంటి సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.
టీ స్పూన్ అల్లంముద్దను నెయ్యిలో ఉడికించి తీసుకుంటే శోథ, తుమ్ములు, ఉదర భాగంలో పెరుగుదలలు, ఆకలి మందగించటం వంటి అనేక రకాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది.
రెండు చెంచాల అల్లం రసంలో రెండు చెంచాల ఉల్లిరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
పూటకు రెండు చెంచాల అల్లం రసంలో తగినంత పటిక బెల్లం లేదా పంచదార కలిపి రెండుపూటలా తీసుకుంటూ ఉంటే బహుమూత్రం సమస్య తగ్గుతుంది. ఇది మూత్ర సంబంధపు ఇనె్ఫక్షన్ల కారణంగా వచ్చే బహుమూత్రత్వంలో ఉపయుక్తంగా ఉంటుంది.
అల్లం, త్రిఫలాలు, (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ) బెల్లం సమాన భాగాలు తీసుకొని కలిపి ముద్దగా నూరి పూటకు టీ స్పూన్ మోతాదుగా రెండుపూటలా తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
ఒక లీటర్ అల్లం రసంలో అర కిలో నువ్వుల నూనె కలిపి ద్రవాంశం ఆవిరై కేవలం తైల భాగం మిగిలేంతవరకూ చిన్న సెగమీద మరిగించి వడపోసి నిల్వచేసుకోవాలి. దీనిని కీళ్లమీద, నొప్పులున్న శారీరక భాగాలమీద రాసుకొని మృదువుగా మర్ధనా చేసుకుంటే నొప్పులనుంచి ఉపశమనం లభిస్తుంది.
10గ్రాములు అల్లం, 10 గ్రాముల జిల్లేడు చెట్టు కాండం వీటిని రెంటిని ముద్దగా దంచి మిరియం గింజలంత పరిమాణంలో మాత్రలుగా చుట్టి నిల్వచేసుకోవాలి. వీటిని రోజుకు రెండుమూడుసార్లు వేడినీళ్లతో తీసుకుంటే కలరాలో ఇనె్ఫక్షన్ తగ్గుతుంది.
అల్లం రసం, తులసి రసాలను సమానంగా కలిపి దానికి తేనె, నెమలి ఈకల భస్మంను కలిపి టీ స్పూన్ మోతాదుగా 2-3సార్లు తీసుకుంటే కలరా నియంత్రణలోకి వస్తుంది.
రెండు చెంచాల అల్లం రసానికి 5గ్రాముల పాత బెల్లం కలిపి తిని, మేక పాలతో తయారుచేసిన ఆహారం తీసుకుంటుంటే సాధారణ వాపులు తగ్గుతాయి.
త్రికటు చూర్ణం, (శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు) రాతి ఉప్పు (సైంధవ లవణం), అల్లం రసం సమాన భాగాలు కలిపి ఉదయసాయంకాలాలు పూటకు అర టీస్పూన్ మోతాదులో తీసుకుంటే సన్నిపాత జ్వరం, ప్రలాపనలు తగ్గుతాయి.