రెండు చుక్కల నెయ్యి ముఖానికి రాయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

 



చలికాలం చర్మానికి పరీక్ష కాలం అని చెప్పవచ్చు.   చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఈ కాలంలో చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వందలు, వేలాది రూపాయలు వెచ్చించి  ఫేస్ క్రీమ్ లు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేస్తుంటారు.  మరికొందరు ఇంట్లోనే చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయితే ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను వదిలి కేవలం రెండు చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకోమని చెబుతున్నారు  చర్మ సంరక్షణ నిపుణుల నుండి వైద్యుల వరకు. అసలు నెయ్యిని ముఖానికి రాయడం వల్ల జరిగేదేంటి? ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను మించి నెయ్యి చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే..


ముఖం పై మచ్చలు, ముడతలు, పొడిబారడం వంటి వాటిని పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు వాడతారు. అలాగే చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా వాడతారు. అయితే వీటి బదులు నెయ్యి వాడవచ్చు.

నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మ్యాజిక్ జరుగుతుంది.  నెయ్యిని ముఖానికి రాస్తుంటే చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. ఇది చర్మం చలి కారణంగా  పొడిబారడం, పగుళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.  నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి.


నెయ్యిలో అరాకిడోనిక్, లినోలెనిక్ ఆమ్లం వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దెబ్బతిన్న చర్మానికి పోషణను ఇస్తాయి. ఫలితంగా వాడిపోయి పగుళ్లు ఏర్పడిన చర్మం తిరిగి యవ్వనంగా, ఆరోగ్యంగా మారుతుంది.

ముఖ చర్మం వాడిపోయి రంగు కోల్పోయినట్టుగా ఉన్నప్పుడు రెండు చుక్కల స్వచ్చమైన నెయ్యిని ముఖానికి అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల  ముఖం చర్మం కాంతివంతంగా మారుతుంది.  చర్మ కణాల నష్టం తగ్గుతుంది.

ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటే రెండు చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయాలి.  ఇలా ప్రతిరోజూ రెండు చుక్కల నెయ్యి ముఖానికి పూస్తుంటే  చర్మం పై మచ్చలు,  మొటిమలు వదులుతాయి.  చర్మం మీద అన్ని రకాల మచ్చలు లేకుండా క్లిస్టర్ క్లియర్ అవుతుంది.

నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయనే విషయం తెలిసిందే.  ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ముఖం మీద ముడతలను తొలగించి ముఖ చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.  ప్రతిరోజూ నెయ్యిని ఇలా ముఖానికి రాసుకుంటూ ఉంటే ఎంత వయసు పెరిగినా చర్మం యవ్వనంగా ఉంటుంది.


                                       *రూపశ్రీ.