ఆహార ధాన్యాలతో ఉపయోగాలేమిటి...?

మనకు ఆహార ధాన్యాలు మంచివని మాత్రమనే తెలుసు. కానీ అవి మనకు ఎలాంటి మేలు చేస్తాయో తెలుసా..? మరి అసలు ఆహార ధాన్యాల వలన ఎలాంటి ఉపయోగాలున్నాయో ఒకసారి చూద్దామా!

మనం తీసుకునే ఆహారంలో రోజు ఒకే రకం కాకుండా... అన్నిరకాల ధాన్యాలను తీసుకుంటూ ఉండాలని పోషక నిపుణులు చెబుతున్నారు.పిండి పదార్ధాలలో మొదటిదైన వరిలో తక్కువ మోతాదులో కొవ్వులు ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ ఉండదు. గోధుమలలో B కాంప్లెక్స్ వనరులు,యాంటీ ఆక్సిడెంట్లు,E - విటమిన్లు కూడా ఉంటాయి. బార్లీలో బీటా గ్లూకాన్, మొక్కజొన్నల్లో థైమీన్(హెచ్1) సమృద్దిగా దొరుకుతుంది. ఓట్స్ లలో త్వరగా జీర్ణమయ్యే పీచుతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ మధుమేహాన్ని తగ్గిస్తాయి. జొన్నలు పాస్పరస్ నిల్వలు, రాగులు కాల్షియం సమృద్దికాలను కలిగి ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తులు పడనివారికి ఈ ఆహార ధాన్యాలు మంచి ఆహారం.

ఈ ధాన్యాలన్నింటిని 100 గ్రా. చొప్పున తీసుకుంటే.. మన శరీరానికి సుమారు 330 క్యాలరీలు చొప్పున లభిస్తాయి.