ఈ ఫేస్ సీరమ్ వాడితే.. అద్భుతమే..!


కాలంతో పాటు వయస్సు పెరుగుతుంది. ఇది ఒక సాధారణ సహజ ప్రక్రియ. అయితే ముడతలు మరియు సన్నని గీతలు వంటి సమస్యలు  వయస్సు కంటే ముందే వ్యక్తుల ముఖాల్లో కనిపిస్తాయి కొందరికి.  అమ్మాయిలు చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటు ఉంటారు.  ఈ ముడతలు, గీతలు పోగొట్టుకోవడం కోసం  ఖరీదైన,  రసాయనిక యాంటీ ఏజింగ్ క్రీములను వాడుతూ ఉంటారు. కానీ అలాంటి క్రీములు,  చికిత్సలు లేకుండా  ముఖంపై వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చు. దీనికోసం పేస్  టోనర్ మ్యాజిక్ లాగా పనిచేస్తుందట. ఇంతకు ఈ ఫేస్ టోనర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.  దీన్నెలా వాడాలి తెలుసుకుంటే..

టోనర్..

ఫేస్ టోనర్ వాడటం వల్ల ముఖం మీద ముడతలు, గీతలు తొలగించుకోవచ్చు.  దీనికోసం కావలసిన పదార్థాలు..

1/2 గ్లాసు వేడినీరు
గ్రీన్ టీ బ్యాగులు
2 స్పూన్ బియ్యం
1 టీస్పూన్ కలబంద జెల్
1 స్పూన్ గ్లిజరిన్

తయారీ విధానం..

 ముందుగా వేడినీటిని తీసుకోవాలి. గ్రీన్ టీ బ్యాగ్‌ను అందులో 6 నుండి 7 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఈ నీటిని చల్లబరచాలి.  2 చెంచాల బియ్యం తీసుకొని నీటిలో నానబెట్టాలి. వాటిని 2 గంటలు నీటిలో నానబెట్టాలి.

దీని తరువాత బియ్యం నీటిని గ్రీన్ టీ నీటితో సమాన పరిమాణంలో కలపాలి. ఇప్పుడు దానికి ఒక చెంచా కలబంద జెల్,  ఒక చెంచా గ్లిజరిన్ జోడించాలి. ఈ వస్తువులన్నింటినీ బాగా కలిపి ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపాలి.

ఎలా వాడాలి?

ముఖం శుభ్రం చేసుకున్న తరువాత ఈ ఫేస్ టోనర్ ను ముఖం మీద స్ప్రే చేయాలి. ఇది ముఖం మీద ముడతలు,  గీతలు,  చర్మం మీద చాలా పెద్దగా తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాలు మొదలైనవి తగ్గేలా చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా కనీసం రెండు వారాల పాటు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

                                    *రూపశ్రీ