బీర్ తో మొహం మీద ముడతలు మటుమాయం

 

 

ఆర్టికల్ హెడ్డింగ్ చూసి అవాక్కు అవ్వకండి. బీర్ తో పేస్ ప్యాక్  వేసుకుంటే నిజంగానే ముడతలు పోతాయట. మనం అందం కాపాడుకోవటం కోసం రకరకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటాం,కాని ఈ రోజుల్లో కాలుష్యం వల్ల చిన్నవయసులోనే మొహం మీద ముడతలు వచ్చి ముసలిరూపు కనిపిస్తోంది. దీనిని నివారించుకోవచ్చు ఈ ప్యాక్ తో. దీనికి కావాల్సిన పదార్థాలు కాస్త శ్రమపడి సమకూర్చుకుంటే చాలు,మీ మొహం మీద ముడతలు ఇక పోయినట్టే. ఉన్నవయసుకి అయిదేళ్ళు తక్కువగా కనిపిస్తారు కూడా.

 

 

పేస్ ప్యాక్ కి కావలసినవి:
1/2 గ్లాస్ రోజ్ వాటర్
1/2 గ్లాస్ బీర్
1 నిమ్మకాయ

 

ఎలా తయారు చేసి అప్లై చెయ్యాలంటే.....

 

 

ఒక బౌల్ లో నిమ్మకాయని కోసి రసం పిండి ఉంచుకోండి. దానిలో రోజ్ వాటర్,బీర్ పోసి బాగా కలపండి. కాటన్ బాల్ తో మొహానికి ఆ లిక్విడ్ ని అద్దండి. సర్కులర్ షేప్ లో అప్లై చేస్తే ఇంకా మంచిది. ఒక అరగంట ఆరనిచ్చి గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. మంచి రిజల్ట్ కోసం రాత్రి పడుకునే ముందు దీనిని రాసుకుని,తెల్లారి లేచాకా కడిగేసుకుంటే చాలు. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటె కొన్నాళ్ళకి మీ కళ్ళని మీరే నమ్మలేనట్టు తయారవుతుంది మీ అందాల మోము. ట్రై చేస్తారు కదా!

.....కళ్యాణి