యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు, నియమాలు, నిషేధాలు

 

Information on yoga practices do's and dont's yoga advices health and yoga

 

యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు

1    మనం జీవిస్తున్న ఈనాటి ఆధునిక యుగంలో, అత్యాధునిక నగరజీవితంలో క్షణం క్షణం మనిషికి      కలుగుతున్న టెన్షను, వత్తిడి, నీరసం, నిస్పృహ, భయం,     వ్యతిరేక ఆలోచనలు, అవధానశక్తి తరుగుదల మొదలైన రుగ్మతులు తగ్గిపోతాయి.
2     శారీరకంగా, మానసికంగాను సుఖశాంతులు, ఆరోగ్యం పొంది ఆత్మవికాస మార్గాన పయనించి మనిషి తన జన్మను సార్థకం చేసుకుంటాడు.
3     ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఆవేశం, మొదలగు దుష్ప్రవృత్తులు తగ్గి ప్రశాంతత, స్థిరత్వం మనిషి పొందుతాడు.
4     మధుమేహం, ఆస్తమా, రక్తపోటు, గుండెనొప్పి, నడుంనొప్పి, మోకాళ్ళ నొప్పి, అజీర్తి మొదలగు దీర్ఘరోగాలు నయమై, మనిషి శరీరం బంగారంలా         నిగనిగలాడుతుంది.
5     స్త్రీలు యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం పొడడమే గాక, తమ సౌందర్యాన్ని పెంచుకుంటారు. తమ కుటుంబాన్ని సరిదిద్దుకొని క్రమశిక్షణతో పిల్లలని పెంచి, ఉత్తమ     పౌరులుగా వారిని తీర్చిదిద్దుతారు.
6     యోగాభ్యాసం అలవాటు కాగానే మనిషి దినచర్య, అలవాట్లు, ఆలోచనా విధానం, ఆహారవిహారడులు మొదలైన విషయాలన్నిటిలో సాత్విక మార్పు         సాధిస్తాడు. తామస, రాక్షస ప్రవృత్తులు తగ్గుతాయి. అలాంటి సాధకులు ఉత్తమ పౌరులుగా దేశానికి, ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తారు.
7     యోగాభ్యాసం చేసే సాధకులు తమ నిత్య కార్యక్రమాలలో, విధుల్లోనూ దక్షత, ఏకాగ్రత, చురుకుదనం సాధించి అధికారుల మన్నన పొందుతారు.         యోగకర్మకు కౌశలం అనో ఆర్యోక్తిని అమల్లోకి తెస్తారు.

 

Information on yoga practices do's and dont's yoga advices health and yoga

 

యోగాభ్యాస నియమాలు :

1     ప్రతిరోజూ రాత్రి త్వరగా పడుకొని హాయిగా నిద్రపోవాలి. తెల్లవారు ఝామున లేచి, పళ్ళుతోముకుని, మలమూత్ర విసర్జన చేసుకుని, స్నానం చేసి,     పరగడుపున యోగాభ్యాసం ఆరంభించాలి.
2     స్నానం చేయకుండా కూడా యోగాభ్యాసం చేయవచ్చు. అయితే యోగాభ్యాసం పూర్తి అయిన కొద్ది సేపటి తరువాత స్నానం చేయవచ్చు.
3     గాలి, వెలుగు వచ్చే ప్రదేశాలలో, కిటికీలు, తలుపులు తెరిచి ఉన్న గదుల్లోనూ సమతలంగా వున్న చోట యోగాభ్యాసం చేయాలి.
4     ఉదయం ప్రసరించే సూర్యరశ్మిలో యోగాభ్యాసం చేయడం ఎన్నో విధాల మంచిది.
5     నేలమీద గాని, గచ్చుమీద గాని, బండలమీద గాని యోగాభ్యాసం చేయకూడదు. తివాచీగాని, కంబలికాని, పరిశుభ్రమైన బట్టగాని పరిచి దానిమీద         కూర్చుని యోగాభ్యాసం చేయాలి.
6     ఇంట్లో పురుషులు డ్రాయరు ధరించి యోగాభ్యాసం చేయాలి. స్త్రీలు తక్కువ బట్టలు, ముఖ్యంగా పంజాబీ డ్రస్సు ధరించడం మంచిది. సాధకులు             యోగాభ్యాసం బహిరంగ ప్రదేశాల్లో చేస్తున్నప్పుడు వదులుగా వున్న దుస్తులు ధరించాలి.
7     యోగాభ్యాసం చేస్తున్నప్పుడు, మలమూత్ర విసర్జన చేయవలసి వస్తే, లేచి వెళ్ళి తప్పక చేయాలి. బలవంతాన ఆపుకోకూడదు. త్రేపులు, తుమ్ములు,         దగ్గులు మొదలైన వాటిని ఆపుకోకూడదు. దాహం వేస్తే కొద్దిగా మంచినీళ్ళు త్రాగచ్చు.
8     తొందరపడకుండా, అలసట లేకుండా తాపీగా యోగాభ్యాసం చేయాలి. అలసట వస్తే కొద్దిసేపు శాంత్యాసనం లేక శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
9     సాధ్యమైనంతవరకు యోగాభ్యాసం ప్రతిరోజూ చేస్తూ ఉండాలి.
10     యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సును, మస్తిష్కాన్ని దానిమీదనే కేంద్రీకతించాలి. ఇతర ఆలోచనలని సాధ్యమైనంత వరకు దరికి రానీయకూడదు.
11     యోగాభ్యాసం పూర్తికాగానే తప్పక మూత్ర విసర్జన చేయాలి. ఆ మూత్రం ద్వారా లోపలి కాలుష్యం బయటికి వెళ్ళిపోతుంది.
12     పెనుగాలి వీస్తున్నప్పుడు దాని మధ్య యోగాభ్యాసం చేయకూడదు.
13     యోగాభ్యాసం చేస్తున్నప్పుడు చెమటపోస్తే బట్టతోగాని, అరిచేతులతో కాని మెల్లగా ఆ చెమటను తుడవాలి. గాలిలో చెమట ఆరిపోయినా మంచిదే.

 

Information on yoga practices do's and dont's yoga advices health and yoga

 

యోగా నిషేధాలు :

1     రజస్వల, ముట్టు లేక గర్భవతి అయినప్పుడు స్త్రీలు యోగాభ్యాసం చేయకూడదు. సూక్ష్మయోగ క్రియలు మరియు ధ్యానం చేయవచ్చు.
2     బాగా జబ్బుపడినప్పుడు, ఆపరేషను చేయించుకున్నప్పుడు, ఎముకలు విరిగి కట్టు కట్టించుకున్నప్పుడు యోగాభ్యాసం చేయకూడదు. తరువాత         నిపుణుల సలహా తీసుకుని తిరిగి ప్రారంభించవచ్చు.
3     8 సంవత్సరాల వయస్సు దాటే దాకా బాలబాలికలచే బలవంతాన యోగాభ్యాసం చేయించకూడదు.
4     మురికిగా వున్న చోట, పొగ మరియు దుర్వాసన వచ్చే చోట యోగాభ్యాసం చేయకూడదు.
5     యోగాభ్యాసం చేయదలచిన వాళ్ళు యోగశాస్త్ర నిపుణుల సలహాలు తీసుకోవడం అన్ని విధాల మంచిది.