పతంజలి మహర్షి తమ యోగా దర్శనంలో యోగాభ్యాసానికి కలిగే అంతరాయాల్ని గురించి వివరిస్తూ "వ్యాధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యా విరతి భ్రాంతి దర్శనాలబ్ది భూమికత్వా నవస్తితత్వాని చిత్తవిక్షేపా: తే న్తరాయా:" అనగా వ్యాధి, స్త్యానం, సంశయం, ప్రమాదం, ఆలస్యం, అవిరతి, భ్రాంతి దర్శనం, అలబ్ద భూమికత్వం, అనవస్థితత్వం అను 9 అవాంతరాల్ని త్యజించాలని భోదించాడు. ఈ 9 అవాంతరాల్ని యోగామలాలు అని కూడా అంటారు.


1) వ్యాధి - శరీరంలో ఏర్పడే వ్యాధులు, రుగ్మతలు.

2) స్త్యానం - యోగసాధనకు అవసరమైన సామర్థ్యం లేకపోవుట.

3) సంశయం - యోగాసాదనను గురించిన శంకలు, సందేహాలు.

4) ప్రమాదం - యమనియమాది యోగాంగాలను అనుష్టించలేకపోవుట.

5) ఆలస్యం - అలసట, నిర్లక్ష్యం వల్ల యోగసాధన చేయకపోవుట.

6) అవిరతి - ఇతర విషయాలలో లీనమై, యోగసాధన యెడ అనురాగం తగ్గుట.

7) భ్రాంతి దర్శనం - యోగాభ్యాసం వివరాల విషయమై భ్రాంతి కలుగుట.

8) అలబ్ధభూమికత్వం - యోగాభ్యాసం చేస్తున్నప్పటికీ మనస్సు ఆ స్థాయిని, లేక ఆ దశను పొందకపోవుట.

9) అనవస్థితత్వం - మనస్సు ఆయాస్థాయిలకు, అనగా దశలకు చేరుకున్నప్పటికీ అక్కడ స్థిరత్వం అనగా నిలకడగా ఉండకపోవుట.

పైన తెలిపిన అవాంతరాలను అధిగమిస్తే సాధకులు యోగాభ్యాసం ద్వారా సులభంగా పూర్తి ప్రయోజనం పొందవచ్చు.