అమ్మబాబోయ్.. ఈ నెయిల్ పాలిష్ కొనాలంటే ఖరీదైన విల్లా కూడా  అమ్ముకోవాల్సిందే..

అందానికి అమ్మాయిలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అమ్మాయిలు సహజంగానే ఎంత అందంగా ఉన్నా సరే.. తమ అందం మరింత పెరగాలని  ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరంలో ప్రతి భాగాన్ని ఆకర్షణగా తీర్చిదిద్దుకుంటారు. కళ్లకు కాటుక, నుదుటన బొట్టు, కనురెప్పలు, కనుబొమ్మలు, పెదవులు, వేళ్లు, వేలి గోర్లు  ఓయబ్బో ఈ సింగారాలకు అంతులేదు.  అమ్మాయిల ఈ వీక్నెస్ ఏ బ్యూటీ ఉత్పత్తుల బిజినెస్ కూడా. పైన చెప్పుకున్న ఎన్నో ఐటెమ్స్  కు పదుల నుండి వందలు వేలు కూడా ధారబోస్తారు. అయినా కించిత్  విచారం కూడా వ్యక్తం చేయరు.

ఈ కారణంగానే చాలా బ్యూటీ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల ధరలను ఆకాశాన్నంటేలా  ఉంచుతుంటారు. ఇకపోతే అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన నెయిల్ పాలిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాచుర్యం పెరిగాక నెయిల్ పాలిష్ ల అమ్మకాలు కూడా బాగా  ఊపందుకున్నాయి.  సాధారణంగా నెయిల్ పాలిష్ ల ధరలు చిన్న చిన్న షాప్ లలో మన్నిక  క్వాలిటీ లేనివి అయితే 20రూపాయల నుండి లభిస్తాయి. అదే మంచి క్వాలిటీ కావాలంటే వీటి ధరలు 50 నుండి వందల రూపాయలు ఉంటాయి. ఇంకా ఖరీదైన బ్రాండులు అయితే వేలు కూడా ఉండొచ్చేమో. కానీ ఓ నెయిల్ పాలిష్ ధర మాత్రం గుండెలు దడదడలాడిస్తోంది. ఈ నెయిల్ పాలిష్ కొనాలి  అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న మంచి విల్లాను అమ్మేసుకోవాలి. ఏంటి నెయిల్ పాలిష్ కే అంత మాట అంటున్నారని డౌటా? అయితే ఈ నెయిల్ పాలిష్ కథ తెలుసుకోవాల్సిందే..

అమ్మాయిలు ఎంత అందంగా తయారైనా సరే. అందమైన చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకపోతే అంత ఆకర్షణ ఉండదు. అంతేనా డ్రస్సుకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ పెడితే మరింత ఆట్రాక్షన్ గా మారిపోతారు. చాలావరకు అమ్మాయిల దగ్గర కనీసం ఓ పది రంగులైనా నెయిల్ పాలిష్ లు ఉండనే ఉంటాయి. వీటి ధర 50 నుండి వందలు, వేలు ఉండచ్చు. కానీ నెయిల్ పాలిష్ ధర ఏకంగా కోటి రూపాయలు ఉండటం ఎప్పుడైనా విన్నారా? కోటి అనేమాట వింటుంటేనే దిమ్మతిరిగిపోతుంది కానీ ఇది అక్షరాలా నిజమే.. లాస్ ఏంజిల్స్ కు చెందిన అజాచర్ బ్లాక్ అండ్ డైమండ్ నెయిల్ పాలిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గా నిలుస్తోంది.  15మి.లీ ల నెయిల్ పాటిష్ ధర్ ఏకంగా రూ. 1,63,66,000. ఇంత డబ్బు తో హైదరాబాద్ లో మాంచి విల్లాను కొనుగోలు చేయవచ్చు. లేదూ.. ఈ నెయిల్ పెయింట్ కొనాలని అనిపించిందా.. ఇదిగో మాంచి ఖరీదైన విల్లాలను అమ్ముకుని నెయిల్ పాలిష్ కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నెయిల్ పాలిష్ తెగ హాట్ టాపిక్ గా మారింది.  కేవలం గోర్లకు వేసుకునే నెయిల్ పాలిష్ ఇంత ఖరీదు ఉండటమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

                                                       *నిశ్శబ్ద.