అందమైన చేతి సంచులు

స్ట్రింగ్ డ్ పౌచ్.. లేటెస్ట గా పార్టీలలో మనందరికి కనిపిస్తూ మురిపిస్తున్న ఈ పొట్లి బ్యాగ్ ని అచ్చ తెలుగులో చెప్పాలంటే చేతి సంచి అనవచ్చు. పూర్వం మన అమ్మమ్మ,నాయనమ్మ వాడిన చేతి సంచికే కాస్త అలకారం చేస్తే ఇలా స్టైలిష్ స్ట్రింగ్ డ్ పర్స్ గా మారిపోయింది.

ఇవి ఇప్పుడు నెట్టెడ్ , వెల్వెట్ లాంటి  ఫ్యాబ్రిక్ లతోపాటు పాలిసిల్క్ అలాగే  రకరకాల కాటన్ ప్రింట్లతో పాటు సింపుల్ గ కూడా దొరుకుతున్నాయి.ఫోన్, మని, క్రెడిట్ , కార్డులు ఇందులో చక్కగా సరిపోతాయి.వీటిని అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు ,'బటువా' పర్సులని పిలుస్తారు , మరీ ఇలాంటి 'బటువా' లు మీ దగ్గర వున్నాయా . లేకపోతె వెంటనే షాపింగ్ చెయ్యండి . ఈ సారి పార్టీలో  మీ పౌచ్ తో   మెస్మరైజ్ చేయండి అందర్ని...