నీటిలో దీపాలు.. ఇళ్లంతా అందం

 

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం దీప్తినిస్తుంది.. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మీకి నమస్కరించుకుంటారు. అనంతరం దీపాలను తులసికోట వద్ద.. వాకిట్లో ఉంచుతారు.. పండుగనాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాస్తంత క్రియేటివిటీ జోడించి మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో దీపాలు వెలిగించవచ్చు. కుందన్స్, రంగు రంగుల రాళ్లతో దీపాలను తయారు చేసి వాటిని నీటిలో ఉంచితే వచ్చే అందమే వేరు. అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=iG0MqO5maXg