కొల్లాజెన్ అంటే ఏంటి.. మహిళల్లోనే ఇది ఎందుకు లోపిస్తుంది... దీన్ని ఎలా భర్తీ చేయాలి?

శరీరం సరైన రీతిలో పనిచేయడానికి అనేక రకాల ప్రొటీన్లు,  విటమిన్లు అవసరం. కొల్లాజెన్ అటువంటి ప్రోటీన్లలో ఒకటి. ఇది  శరీరంలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటుంది.  శరీరం దానిని సహజంగా తయారు చేస్తుంది. అయితే  శరీరంలో కొల్లాజెన్ పాత్ర ఏంటి? అనే విషయం గురించి తెలుసుకుంటే..  మొత్తం శరీరానికి మెరుగైన నిర్మాణాన్ని,  బలాన్ని అందించడం కొల్లాజెన్ పాత్ర.  ముఖ్యంగా  చర్మం,  జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మహిళల్లో  కాలక్రమేణా ఈ కొల్లాజెన్ స్థాయి తగ్గుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వయసు పెరగడంతో పాటు కొల్లాజెన్ స్థాయి కూడా తగ్గుతుంది. ఈ కారణంగానే  వృద్దాప్యం సంభవిస్తుంది. అయితే కొల్లాజెన్ తగ్గడానికి వయసు పెరగడమే కారణం కాదు.. శరీరంలో ఏర్పడే కొన్ని  లోపాల కారణంగా కూడా కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది.

కొల్లాజెన్ పాత్ర ఏమిటంటే..

 శరీరంలోని మొత్తం ప్రోటీన్‌లో 30% కొల్లాజెన్ ఉంటుంది. ఇది  చర్మం, కండరాలు, ఎముకలు,  కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం. ఆహారం సరిగ్గా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన  కొల్లాజెన్ భర్తీ అవుతుంది. ఒకవేళ ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది. మహిళలు ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కనుక మహిళల్లలో ఈలోపం ఎక్కువగా ఉంటుంది.

ఈ మూడు ఇతర కారణాల వల్ల కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది..

వృద్ధాప్యం రాకుండా  శరీరంలో కొల్లాజెన్ స్థాయిని తగ్గించడానికి కారణమయ్యే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. సూర్యరశ్మి, ధూమపానం,  చక్కెర అధికంగా తీసుకోవడం ఇందులో ప్రముఖమైనవి. అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన  ఇది ప్రభావితం అవుతుంది.  ఇది కాకుండా, సిగరెట్ పొగలో ఉండే అనేక రసాయనాలు కూడా కొల్లాజెన్ ను దెబ్బతీస్తాయి, దీని కారణంగా చర్మం వదులుగా మారిపోయి ముడతలు పడుతుంది.

కొల్లాజెన్ చర్మానికి చాలా ముఖ్యమైనది. దీని లోపాన్ని భర్తీ చేయడానికి కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల చర్మ స్థితిస్థాపకత మెరుగుపడుతుందని,  ముడతలను తగ్గించడంలో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కొల్లాజెన్ లోపం ఉన్నవారిలో అకాల వృద్దాప్యం స్పష్టంగా చూడవచ్చు.

 కొల్లాజెన్ ఎముక బలానికి కూడా చాలా ముఖ్యమైనది. ఈ కారణంతో చేతి, తుంటి,  మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులు క్రమం తప్పకుండా కొల్లాజెన్ ను తీసుకోవడం వల్ల మూడు నెలల్లో  వాటి తాలుకూ  నొప్పి తగ్గుతుంది. అయితే కొల్లాజెన్ సప్లిమెంట్లను  ఎక్కువ కాలం తీసుకోవజం వల్ల ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కొల్లాజెన్ ను సప్లిమెంట్ల ద్వారా కంటే ఆహారం ద్వారా భర్తీ చేయడం చాలా మంచిది.  కొల్లాజెన్  జంతు ఆధారిత ఆహారాలలో పుష్కలంగా లభిస్తుంది. వీటి  వినియోగం కొల్లాజెన్ భర్తీకి మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ జంతు ఆధారిత ఉత్పత్తులలో రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వైద్యులు ఏమి చెబుతారంటే మహిళలు కొల్లాజెన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి ముఖ చర్మం వదులుగా మారి, ముడుతలు పడుతూ వృద్దాప్యం మీద పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ లక్షణాలు గమనించిన తరువాత వారు వైద్యులను కలిసి వైద్యుల సలహా మేరకు కొల్లాజెన్ ను తీసుకోవడం సురక్షితం.  

                                                                  *నిశ్శబ్ద.