పొట్ట పరిమాణం ఎనభై సెంటీ మీటర్లు ఉంటే మధుమేహం ప్రమాదం ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. కాబట్టి సన్నగా ఉన్నవాళ్లు కూడా తమ పొట్ట పరిమాణాన్ని గమనించుకుంటూ ఉండాలి. పొట్ట దగ్గర ఉండే కొవ్వు విడుదల చేసే కొన్ని రకాల రసాయనాలు, రక్తంలో చక్కర స్థాయుల పనితీరులో చేరి సమస్యను మరింత తీవ్రం చేస్తాయట. అందుకే పొట్ట పరిమాణంపై తప్పక దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
వీలయితే ప్రతీరోజు మొదట తీసుకునే ఆహారంలో "ఓట్స్" చేర్చుకోవటానికి ప్రయత్నించాలి. ఇందులో ఉండే పీచు పదార్థంఆరోగ్యానికి మంచిది. కూరగాయలు, పళ్ళు, నడక, వ్యాయామం ఇవన్నీ కూడా ఎలాంటి అనారోగ్యాన్ని అయిన దూరంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే మన అందం, ఆరోగ్యం మన చెంతనే ఉంటుంది.