మీ పిల్లల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..?

మీ ఇంట్లో పసిపాపాయిని ఎప్పుడైనా గమనించారా!

అల్లరిగా నవ్వుతూ..హాయిగా ఆడుకుంటూ ప్రపంచంలోని ఆనందం అంతా తన కోసమే అన్నట్టుగా కనిపిస్తుంది. అ నవ్వు, అ అల్లరి ...అ చిన్నిరూపం మనకి ఎన్నో నేర్పిస్తాయి...కొంచెం మనం గమనించగలిగితే....

పసివారి ప్రపంచం నిండా...ఎప్పుడు సంతోషమే...చిన్న చిరునవ్వు ఎప్పుడూ అలా వారి పెదాలపై కన్పిస్తూనే వుంటుంది. అందుకే పిల్లల్ని చూడగానే మన పెదాలపై నవ్వు విరిసేది...వారిలా మన పెదాలపై కూడా నవ్వు విరిస్తే ఆ నవ్వు ఎదుటివారి పెదాలపై కూడా పాకి...అలా అలా...వైరస్ లా అందరిని నవ్వులతో ముంచెస్తుంది...so పిల్లల్ను౦చి మనం నేర్చుకోవలసిన మెదటి పాఠ౦ ఈ చిరునవ్వే.

ఇక "నాకు ఇదుంటేనే ఆనందంగా వుంటాను" అన్న బాధ ఉండదు పిల్లలకి - చీపురు పుల్లతో కూడా ఆడేసుకునే నేర్పు వారి స్వంతం - కుర్చితో కారు ఆట, కర్రతో గుర్రం ఆట ఇలా...వాళ్ళకి నచ్చిన ఆట ఆడేస్తుంటారు..ఆనందంగా వుంటారు. "దొరికిన దానితో ఆనందంగా ఉండగలగటం" ఎలా అన్నది పిల్లల నుంచి మనం నేర్చుకోవలసిన రెండవ పాఠ౦.

కొత్తగా మాటలు నేర్చుకొనేటప్పుడు పిల్లలు వారికి వచ్చీరాని మాటల్నే పదేపదే అందరి ముందు చెబుతుంటారు. మాటలే కాదు...వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకున్నా... దీక్షగా వాటినే ప్రాక్టిస్ చేస్తుంటారు...నడక నేర్చుకొనేటప్పుడు పడిపోతే లేస్తారు...మళ్ళీ ప్రయత్నిస్తారు. ఇలా వాళ్ళ ఎదుగుదలలో నేర్చుకోవలసిన ప్రతీ అంశాన్ని దీక్షగా, ఏకాగ్రతతో నేర్చుకుంటారు, వచ్చేదాకా ఊరుకోరు...'ఓటమి' అస్సలు నచ్చదు వాళ్ళకి..మన అదిలింపులు, బెదిరింపులు, ఏవీ వాళ్ళని ఆపలేవు. ఆ దీక్ష, ఆ ఏకాగ్రత, ఆ పట్టుదల ఇవి చాలు ఓ మనిషి తన లక్ష్యాన్ని చేరటానికి ..పిల్లల నుంచి మనం నేర్చుకోవలసిన మూడో పాఠ౦ ఇది.

పిల్లలు అల్లరి చేయగానే విసుక్కుంటాం..ఒక్కోసారి తీవ్రంగా మందలిసస్తా౦....ఓ దెబ్బ కూడా వేస్తాం...పాప౦ వాళ్ళ memory ఎంత తక్కువంటే ...అమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకోవగానే టక్కున అన్ని మర్చిపోతారు. మనకీ అలాంటీ short memory ఉంటే ఎంత బావుంటుందో కదా! నచ్చని విషయాల గురించి మనమేమో...ఎవరైనా ఓ మాట అంటే పదే పదే గుర్తుచేసుకొని, వారిని ద్వేషించి...మనం బాధపడి ఎంత తత౦గమో... simpleగా పిల్లల్ని follow అయితే ...నచ్చని వాటిని టక్కున మర్చిపోవటం మనం నేర్చుకోవలసిన నాలుగో పాఠ౦.

ఇలా పిల్లల నుంచి మనమేం నేర్చుకోవచ్చు... అని మనం ఎన్నీ చెప్పుకున్నా ....వాటిని అలా చదివి ఇలా వదిలేస్తే ఏం లాభం చెప్పండి...నేర్చుకోవటం, నేర్చుకున్నదానిని ప్రయత్నించటం పిల్లల నుంచి నేర్చుకోవలసిన ఐదవ పాఠ౦.

నేర్చోకోవటానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు పిల్లలు...అందుకే మనల్ని గమనిస్తూ చాలా నేర్చుకుంటారు. నేర్చుకోవలనే తపనే వుండాలి కాని పైన ఆకాశం కింద భూమి...ఎగిరేపక్షి, పాడేకోయల ఇలా అన్నీ మనకి జీవిత సత్యాలని నేర్పించేవే....

ఇదే పిల్లల ఆనందానికి సీక్రెట్...

ఇదే పిల్లల్లోని అమాయకత్వానికి కారణం.

వాళ్ళకి ఇగోలు లేవు. నాకే తెలుసన్న అహంలేదు..

నాకేం రాదన్న భయము లేదు..

అందుకే వాళ్ళు పిల్లలు ...దేవుని ప్రతిరూపాలు...

మరి అ పిల్లలకి Children's Day సంధర్బంగా జేజేలు చెబుదామా!

 

- రమ