పిల్లలు ఎత్తు పెరగట్లేదా? ఈ టిప్స్ ట్రై చేస్తే సరి..!
నేటికాలంలో పిల్లలను గమనిస్తే వారి వయసును కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరు పిల్లలు ఎంత వయసొచ్చినా స్కూల్ పిల్లల్లానే పొట్టిగా ఉంటారు. నిజానికి పిల్లల ఎత్తు అనేది జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెరిగే వయసు అని పెద్దవాళ్లు అంటుంటారు. అలాంటి దశలో కూడా పిల్లలో ఎత్తు పెరుగుదల సరిగా లేకపోతే తల్లిదండ్రులు మాత్రమే కాదు.. పిల్లలు కూడా ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పిల్లలు ఎత్తు పెరగాలంటే తల్లిదండ్రులు కొన్ని టిప్స్ ఫాలో కావాలి. ఈ టిప్స్ ఫాలో అయితే పిల్లలు ఏదైనా కారణాల వల్ల ఎత్తు పెరగడంలో ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి.
వేలాడటం..
పిల్లల ఎత్తు పెరగాలంటే రోజూ కాసేపు వేలాడే వ్యాయామాలు చేయాలి. దీంతో వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా మారడంతో పాటు ఎత్తు కూడా పెరుగుతుంది. పిల్లలను ఒక పార్కులో లేదా ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఈ వ్యాయామాలు చేసేందుకు తగిన వాతావరణం ఏర్పాటు చేయడం మంచిది.
జంప్ రోప్..
పెరుగుతున్న పిల్లలకు జంప్ రోప్ నేర్పాలి. ఇది వారి ఎముకలు దృఢంగా ఉంచడంతోపాటు ఎత్తు కూడా పెరుగడంలో సహాయపడుతుంది. జంప్ రోప్ వల్ల శరీరం ఫిట్‌గా, దృఢంగా మారుతుంది.
నిద్ర..
ఆరోగ్యకరమైన శరీరం కోసం మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇది పిల్లల శరీరం మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. యుక్తవయస్సులో పిల్లలు 8-10 గంటలు నిద్రపోవాలి. ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది, ఎత్తు పెరుగడంలో సహాయపడుతుంది.
యోగా..
పిల్లలను రోజూ యోగా చేసేలా ప్రోత్సహించాలి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఎత్తు కూడా పెరుగుతుంది. తాడాసానం, పశ్చిమోత్తనాసనం, భుజంగాసనం వంటి యోగా భంగిమలు పిల్లలతో చేయించాలి. ఇలా చేయడం వల్ల ఎత్తు పెరుగుతారు.
ఆహారం..
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ముఖ్యం. చిన్నతనం నుండి వారికి పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఇవ్వాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఎముకల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
*రూపశ్రీ.