బీట్‌రూట్‌తో బీపీ దూరం
బీట్‌రూట్ ప్రయోజనాల గురించి ఇప్పటికే ఎన్నో అద్యయనాలు. తాజాగా మరొకటి వెలుగు చూసింది. రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్ రసాన్ని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని రుజువు చేశారు ‘క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్’కు చెందిన వైద్యులు. ‘యూనివర్సిటీకి చెందిన వేలమంది వలంటీర్లకు ఈ రసం ఇచ్చి వారి రక్తపోటును పరీక్షించాం. అలానే ఆ సమస్య తీవ్రమైన వారికీ ఇచ్చి గమనించాం. ఈ రసం రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచుతుందని నిర్థారణ అయింది. సాధారణంగా ఇది ప్రకృతి సిద్ధమైన దుంపకూర. దానివల్ల ఇతర దుష్ప్రభావాలేమీ ఉండవు. అందులో సమృద్ధిగా ఉండే నైట్రేట్ గుండె కవాటాలకు మేలు చేస్తుంది. కర్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే చాలామంది సమస్య వచ్చినపుడు స్వీకరించవచ్చులే అనుకుంటారు. కానీ ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకొని తగు మోతాదులో ఈ కూరను, రసాన్ని స్వీకరిస్తే ఇంకా ఎన్నో ప్రయోజనాలు’ అని చెబుతున్నారు అద్యయనంలో పాలుపంచుకొన్ని ప్రొఫెసర్ అమృతా ఆహ్లూవాలియా.