అవాంఛిత రోమాల నివారణ

చాలా మంది స్త్రీలకు అనవసరమైన చోట్ల రోమాలు ( హెయిర్ ) ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి వివరాలు ఇక్కడ పాఠకుల కోసం ...

సమయం ఎక్కువ కేటాయించలేని వారికోసం రోమాలను తొలగించే ప్రత్యేకమైన క్రీములు చాలా మార్కెట్ లో ఉన్నాయి. వీటిని డెపిలేటరీ క్రీం లు అని అంటారు. ఇవి చర్మం కింది భాగంలో ఉండే వెంట్రుకల మూలాల మీద పని చేస్తాయి. వాటిని నిర్మూలిస్తాయి . ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి. అయితే చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉన్నాయి.

సున్నితమైన శరీర తత్త్వం ఉన్న వాళ్ళు వీటిని చర్మం మీద అప్లై చేస్తే మంట పుట్టే అవకాశం ఎక్కువ. ఇందులో ఉండే రసాయనాలు కొందరికి అలర్జీ కలిగించవచ్చు కూడా. వీటిని కంటి దగ్గర మాత్రం ఎప్పుడూ ఉపయిగించవద్దు. ఏదేమైనా మొదటిసారి క్రీం ఉపయోగించేవారు తప్పనిసరిగా టెస్ట్ చేసుకోవడం అవసరం.

గోరు వెచ్చని నీటితో తడిపిన గుడ్డతో క్రీం అప్లై చేయదలుచుకున్న ప్రాంతంలోని చర్మాన్ని రుద్దాలి. దీని ఫలితంగా అక్కడ ఆండ్ చర్మం మృదువుగా మారడమే కాకుండా సూక్ష్మ రంధ్రాలను మరింత శుభ్రపరుస్తుంది. అప్పుడు రిమూవల్ క్రీం ఎక్కువగా చర్మం లోకి వెళ్ళగలుగుతుంది . క్రీం ను ఉపయోగించే సూచనల కంటే ఎక్కువ సేపు క్రీం ను చర్మం మీద ఉంచకూడదు. ముందుగా తడిగుడ్డతో ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసిన తర్వాత కడుక్కోవడం మంచిది.

వాక్సింగ్, సుగరింగ్ తో వెంట్రుకలను తొలగించడం చాల అ సురక్షితమైన మార్గం. ఎక్కువకాలం ఉండే ఫలితాలు పొందవచ్చు. వెంట్రుకలు కుదుళ్ళనుంచి తొలగించబడతాయి. ఎక్కువ నొప్పి కూడా కలగజేయని పధ్ధతి ఇది. అన్ని బ్యూటీ పార్లర్ లలో దీన్ని ఉపయోగిస్తారు.

లేజర్ ట్రీట్ మెంట్

ఇది కూడా మంచి పద్ధతే అని చెప్పాలి. ఇందులో వెంట్రుకలను కుదుళ్ళ నుంచి తొలగిస్తారు. లేతరంగు శరీర వర్ణం కలిగి ఉన్న వారికి అంటే ఎరుపు, లేదా తెలుపు శరీర వర్ణం ఉండేవారికి లేజర్ ట్రీట్ మెంట్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకటే గాఢమైన రంగు కలిగినవి లేజర్ కిరణాలను ఎక్కువగా స్వీకరిస్తాయి.

అందువల్ల నల్లని శరీర వర్ణం ఉన్నవారికి లేజర్ ట్రీట్ మెంట్ వల్ల మంట పుట్టే అవకాశం ఉంది. దీని వల్ల శాశ్వతంగా వెంట్రుకలను నిర్మూలించడం కుదరకపోవచ్చు. అయితే, ట్రీట్ మెంట్ తీసుకున్న ప్రాంతంలో వెంట్రుకలు కొంచెం పలుచగా పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా ఖరీదైనదే !

షేవింగ్

ఇది పూర్తిగా సురక్షితమైనదే కాక, చవకగా అయిపోయేది. ప్రతి ఒక్కరూ ఎవరికీ వారే షేవ్ చేసుకోవచ్చ్చు. తరచుగా షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తకు తీసుకోవాలి. కొత్తగా ఉండే బ్లేడ్ ను వాడాలి. ముందుగా క్రీం ను అప్లై చేసిన తర్వాతే షేవ్ చేయాలి. క్రీం అప్లై చేస్తే ఆ ప్రాంతంలో చర్మం మృదువుగా మారుతుంది.