స్క్రబ్స్
స్క్రబ్స్ వారానికి ఒకసారి వాడితే అద్భుతమైన మార్పు కనబడుతుంది. ఇది జిడ్డు చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. పొడి చర్మానికి నెలకొకసారి ఉపయోగించినా చాలు. ముఖములోని ముడతల ద్వారా ఏర్పడిన మలినాలు వెంటనే తొలగిపోయి ముఖం కాంతివంతముగా తయారవుతుంది.
ఇంటిలో తయారు చేసుకునే స్క్రబ్స్ :
గోధుమ పిండితో తయారు చేసుకునే స్క్రబ్స్:
1 చెంచా ఓట్ మీల్ పౌడర్
1 చెంచా గోధుమ పిండి
1 చెంచా పాల పై మీగడ
1 చెంచా శాండల్ వుడ్ పౌడర్ ( చందన పౌడర్ )
పైన చెప్పిన పదార్థాలు బాగా ఆకలిపి ఆ మిశ్రమాన్ని సన్నటి బట్టతో చేసిన సంచిలో నింపి ఆ సంచిని గోరువెచ్చని నీటిలో ముంచి దానిని ముఖానికి, మెడకు నెమ్మదిగా, గుండ్రంగా రుద్దాలి. ఈ విధంగా కనీసం 15 నిమిషాలు రుద్ది తర్వాత నీటితో వాష్ చేసుకోవాలి.
నారింజ తొక్కల స్క్రబ్ ( Orange Peel Scrub)
4 చెంచాలు నారింజ తొక్కల పొడి
2 చెంచాలు ఓట్ మీల్ పౌడర్
2 చెంచాలు గోధుమపిండి
పై మూడు పదార్థాలను కలిపి గాలి తగలకుండా మూత పెట్టిన పాత్రలో ఉంచి ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మానికి కొద్ది నిమ్మరసం లేక దోసకాయ రసం ను కలిపి సన్నటి బట్టతో చేసిన సంచిలో నింపి ( మసలిన్ బేగ్) ముఖానికి రుద్దాలి.
పెసరపిండి స్క్రబ్:
4 చెంచాలు పెసరపిండి
4 చెంచాలు బేసన్
4 చెంచాలు శాండల్ వుడ్ పౌడర్
పై పదార్థాలన్నీ బాగుగా కలిపి తగలకుండా ఏదైనా పాత్రలో ఉంచి ఉపయోగించుకోవచ్చు.
కాంప్లెక్షన్ స్క్రబ్ : (ముఖ పర్చస్సు పెంచేది)
1 చెంచా ( ఆల్మండ్) బాదంకాయ పొడి
1 చెంచా నారింజ తొక్కల పొడి
1 చెంచా ఓట్ మీల్ పొడి
పై పదార్థములను బాగుగా కలిపి మూతపెట్టిన పాత్రలో ఉంచి ఉపయోగించుకోవచ్చు.
