Balanced Diet For Weight Reduction

బరువు అదుపుకి కొలతల ఆహారం

* సన్నగా నాజుకుగా, సన్నజాజి పూవులాగా ఉండాలని కోరుకోని వారుండరు. కొన్ని

సంవత్సరాల క్రితం వరకూ ఆడపిల్లల్ని ఎడుమల్లెల ఎత్తుతో పోల్చేవారు. ప్రస్తుతం ఆ

పరిస్థితి కాగడా వేసి వెదికినా కానరాదు. అతి చిన్న వయసు నుంచే ఊబకాయం యువత

పాలిట శాపంగా మారుతోంది. అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్ కి వెళుతున్నారు.

కష్టమైన ఎక్సర్ సైజులు చేస్తున్నారు... అయినా బరువు తగ్గడం లేదన్న ఆవేదన

వినపడుతూనే ఉంది. వ్యాయామంతో పాటు డైటింగ్ చాలా ముఖ్యం.

 

* డైటింగ్ చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. బరువు పెరిగిపోతున్నాం అని బాధపడే

వారి సంఖ్య చాలా ఎక్కువే. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ , మధ్యాహ్నం, రాత్రి భోజనంలో

కింద సూచించినవి తీసుకున్నట్లయితే పోషకాలతో పాటు డైట్ కంట్రోల్ కూడా సక్రమంగా

జరుగుతుంది. ఏయే పదార్థాలను ఎంతెంత తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం.

 

* బ్రేక్ ఫాస్ట్: మొలకెత్తిన తృణధాన్యాలు 40 గ్రాములు, గోధుమలతో తయారు చేసిన టోస్ట్,

రెండు లేక మూడు ఇడ్లీలు, నూనెతక్కువ వేసి కాల్చిన దోసలు రెండు, నూనె వేయకుండా

కాల్చిన చిన్న చపాతీలు రెండు.

 

* భోజనంలో: రెండు పులకలు, లేదా రెండు బ్రెస్ స్లైసులు, ఒక బంగాళాదుంప

ఉడికించినది. అరకప్పు అన్నం లేదా నూడుల్స్, అరకప్పు ఉడికించిన బీన్స్, ఆకుకూర

లేదా, ఇతర కూరగాయలు, ఇవి తప్పని సరిగా ఉదయం, రాత్రి భోజనంలో ఉండే విధంగా

చూసుకోవాలి.

 

* పళ్ళు : రోజుకి కనీరం రెండు రకాల పళ్ళయినా తినాలి. ఒక్కొక్కటి 150గ్రాములు

ఉండాలి. డ్రై ఫ్రూట్స్ అయితే 30 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది.

 

* పాల ఉత్పత్తులు: పాలతో తయారైన వస్తువులను తీసుకోవడం అవసరం. వీటిల్లో ఉండే

కొవ్వు కొంతవరకూ శరీరానికి అత్యవసరం. కొవ్వు తీసేసిన 250 గ్రాములు పాలు,

మీగాడలేని పెరుగు 250 గ్రాములు, 250 గ్రాముల జున్ను తీసుకుంటే మంచిది.

 

* కొవ్వు పదార్థాలు : రోజుకి మూడు స్పూన్ల నూనె కన్నా ఎక్కువ వాడడం ఆరోగ్యానికి

హానికరం. ఈ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. లేదా పూటకి ఒక స్పూన్ చొప్పున

తీసుకోవచ్చు. వేరుశనగ నూనెకి బదులు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడడం మంచిది.

 

* కూరగాయలు: భోజనంలో కప్పు ఉడికించిన కూరగాయలు తీసుకుంటే మంచిది.

మామూలు కూరలు కాకుండా అదనంగా వీటిని తీసుకుంటే పోషకాలు పూర్తిగా లభిస్తాయి.