తొలిసారి నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అరుణా బహుగుణ

జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా తొలిసారి ఓ మహిళా నియమితులయ్యారు. సీనియర్ పోలీస్ అధికారిణి అరుణా బహుగుణను అకాడమీ డైరెక్టర్ గా నియమించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 65 సంవత్సరాల సుధీర్గ చరిత్ర కలిగిన ఈ అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్ గా నియమితులైన అరుణా బహుగుణ 1979 బ్యాచ్ కి చెందిన ఆంధ్ర ప్రదేశ్ కేడర్ ఐపిఏస్ అధికారిణి. పోలీస్ అకాడమీకి ఒక మహిళా డైరెక్టర్ కావడం ఇదే మొట్టమొదటి అవడం విశేషం. 2017 ఫిబ్రవరి వరకు ఆమె ఎన్ పిఏ డైరెక్టర్ గా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

గతంలో ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా, అగ్నిమాపక శాఖ, జైళ్ళ శాఖ, ప్రింటింగ్ మరియు స్టేషనరి డైరెక్టర్ జనరల్ గా పనిచేసారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకుగాను ఆమెకు 1995 లో భారతీయ పోలీస్ పథకం, 2005 లో రాష్ట్రపతి పోలీస్ పతకాలను అందజేసారు.

ఒక మహిళగా అరుణా బహుగుణ సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని... సమాజంలో జరుగుతున్న అఘత్యలకు భయపడకుండా ధైర్యంగా ఏదుర్కోవాలి. మనల్ని మనం తక్కువుగా చూసుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఒక మహిళగా పుట్టినందుకు గర్వపడలి. మనం ఒక ఎతైన స్థాయికి వెళ్ళడానికి ఎవరు నిన్ను ప్రోత్సహించకపోతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని ఒక అరుణా బహుగుణల అవ్వాలి .

 

-వై .లిల్లీ నిర్మల శాంతి