కేక్ అంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే..  మారుతున్న కాలంతో పాటు, కేక్ మన జీవితంలోని ప్రతి ఆనందంలో  భాగంగా మారింది. ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయినా లేదా ప్రత్యేక సందర్భం అయినా  ఖచ్చితంగా కేక్ కట్ చేస్తారు. దీని క్రేజ్ ఎంతగా ఉందంటే ప్రతి ఒక్కరూ తమ వంటగదిలో బేకరీ లాంటి కేక్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది మంచి ఫలితాన్ని పొందలేరు. చివరికి   కేక్ కోసం బేకరీపై ఆధారపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. కానీ ఇకమీదట అలాంటి ఫెయిల్యూర్ మీకెప్పుడూ ఎదురుకాదు. ఎందుకంటే ఇంంట్లోనే కుక్కర్లోనే మెత్తగా స్పాంజ్ కేక్  తయారుచేయడానికి కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. ఈ టిప్స్ ఫాలో అయితే అచ్చం బేకరీలో కొన్న కేక్ లా నోరూరిస్తూ అందరినీ అలరినీ అలరించే కేక్ తయారవ్వడం ఖాయం. దీనికోసం నాలుగు టిప్స్ ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుంటే..

సరైన కుక్కర్‌ని ఉపయోగించాలి..

కేక్ తయారు చేయడానికి కుక్కర్ సెలక్షన్ చాలా ముఖ్యమైనది.  ఎప్పుడూ బరువైన అడుగు మందంగా,  గట్టి మూత ఉన్న కుక్కర్‌ని ఉపయోగించాలి . అలాగే కుక్కర్ మూత పెట్టేటప్పుడు  రబ్బరు తీసి మూత పెట్టాలి. ఇది కాకుండా, కేక్ చేయడానికి ముందు, కుక్కర్‌ను 5 నిమిషాలు సరిగ్గా వేడి చేయాలి.

స్టాండ్ ఉపయోగించాలి..

 కేక్ పిండి ఉన్న పాత్రను నేరుగా కుక్కర్‌లో ఉంచకూడదు. ఇది కేక్‌ను పాడుచేస్తుంది, అంతే కాదు  దానిని మాడిపోయేలా చేస్తుంది. అందువల్ల  ఎప్పుడూ ముందుగా కుక్కర్‌లో స్టీల్ స్టాండ్‌ను ఉంచి, ఆపై పిండి ఉన్న పాత్రను దానిపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల కేక్ బాగా బేక్ అవుతుంది.

కేక్ పిండిలో వెనిగర్ కలపాలి..

 బేకరీలో లాగా ఇంట్లో మెత్తగా  స్పాంజి లాంటి  కేక్ తయారు చేయాలనుకుంటే, పిండిలో అర టీస్పూన్ కంటే కొంచెం తక్కువ వెనిగర్ జోడించాలి.

  ఉష్ణోగ్రత ముఖ్యం..

  కుక్కర్‌లో కేక్‌లను తయారు చేస్తుంటే, గ్యాస్ స్టవ్ మీద తయారుచేయడం మంచిది.  కేక్ ఉడికే మొత్తం సమయం మధ్యస్థంగా ఉంచాలి. ఓవెన్‌లో కంటే గ్యాస్‌పై కేక్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.  కాబట్టి అస్సలు తొందరపడకూడదు. కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి  టూత్‌పిక్‌తో ఒకటి లేదా రెండుసార్లు కేక్ లోపలికి గుచ్చి చెక్ చేయాలి.  అయితే కుక్కర్‌ని పదే పదే  తెరవడం తెరవకూడదు.  సమయాన్ని సెట్ చేసుకుని ఆ తరువాత మాత్రమే చెక్ చేయాలి.

                                                                   *నిశ్శబ్ద.