మృదువైన చేతులకోసం

* ఉల్లిపాయలు కట్ చేసినపుడు ఘాటైన పదార్దాలను ఆ వాసనా చేతినుండి పోవాలంటే నిమ్మరసంతో చేతులు మర్దనా చేసి శుభ్రం చేసుకోవాలి.

* నాలుగు చెంచాల నిమ్మరసంలో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి రాత్రి పడుకునే ముందు రాసుకుని పడుకుని మర్నాడు శుభ్రం చేసుకుంటే చేతులు మృదువుగా వుంటాయి.

* టమాటా రసం రెండు చెంచాలు, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాసుకుని పావు గంట తరవాత కడిగేయాలి . ఇది మంచి బ్లీచింగ్ లా పనిచేస్తుంది.

* పాల మీగడ, గ్లిజరిన్ ,నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చేతులకు రాసి అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి.

* ఘాటైన డిటర్జెంట్ చర్మానికి హాని కలిగిస్తుంది. అలాంటప్పుడు,బంగాలదుంపలు ఉడకపెట్టిన నీళ్ళల్లో ఒక  15 నిముషాలు  చేతులు పెట్టాలి.అప్పుడు చేతులు మృదువుగా తయారైతాయి.

* ఉడికించిన బంగాళాదుంపలను చేతుల మీద రుద్దితే చేతులకున్న మురికి పోయి శుభ్రపడతాయి.

* బట్టలు ఉతికినప్పుడు చేతులు బరకగా తయారైతాయి . అలాంటప్పుడు కొబ్బరి నూనే కానీ మాయిశ్యరైజర్ కానీ తప్పకుండ రాయాలి.

* అలాగే బాదాం ఆయిల్ కూడా చర్మానికి చాలా మంచిది.ఈ ఆయిల్ పడుకోబోయే ముందు చేతులకు రాసుకుంటే చాల మృదువుగా తయారైతాయి.