హోంమేడ్ స్క్రబ్స్
స్క్రబ్ చర్మానికి కొత్త నిగారిపుని ఇస్తుంది. ఇంట్లోనే స్క్రబ్ చేసుకునేందుకు నలుగుపిండిని మించింది లేదు. ఇంకా ఈ కింది చెప్పిన స్క్రబ్ లు కూడా ప్రయత్నించి చూడండి. మెరిసే చర్మం స్వంతమవుతుంది.
$ తేనెకు గుడ్డు తెల్లసొన,నలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లని పాలలో ముంచిన దూదితో ఆ ప్యాక్ ను తీయాలి. తరువాత చల్లని నీటితో
కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పై సన్నని గీతల్లా కనిపించే ముడతలు మాయం.
$ ఇక శనగపిండి, వరిపిండి, ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని దీనికి కొద్దిగా పాలు.ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా వంట నూనె నాలుగైదు చుక్కలు చేర్చి మెత్తని మిశ్రమం లా చేసి ముఖానికి, మెడకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడగాలి. పొడిచర్మం చర్మం కలిగిన వాళ్ళకి ఇది మంచి స్క్రబ్. తరచూ ఇలా చేస్తే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.
సులువుగా ఇంట్లోనే చేసుకునే స్క్రబ్ లు ఇవిప్రయత్నించి చూడండి.
- రమ .