డోన్ట్ వర్రీ... బీ ‘హోలీ’

హోలీ అనగానే ఉషారుగా ఆడి పాడేస్తాం. కానీ ఆ తర్వాత ఆ రంగులు వారం అయినా వదలక ఇబ్బంది పెట్టడం మాత్రం కొంచం చికాకు పెడుతుంది . అలంటి ఇబ్బంది లేకుండా ఈ హోలీని మంచి జ్ఞాపకంగా ఎలా మార్చుకోవచ్చో నిపుణులు చేస్తున్నా కొన్ని సూచనలు మీకోసం ఇక్కడ.

1. అందరికి తెలిసిందే అయినా , మళ్ళీ ఒకసారి చెప్పుకోవలసిన మొదటి విషయం... హోలీ కి కెమికల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ నే వాడటం మంచిది.

2. హోలీ రోజున వేసుకునే బట్టలు పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచేవిగా వుండాలి. సల్వార్, కమీజు లాంటివి పొడవు చేతులతో ఉండేలా వేసుకుంటే హోలీ రంగులు నేరుగా శరీరాన్ని తాకే అవకాశం ఉండదు .

3. ఇక హోలీ రంగులతో ఎక్కువ నష్టపోయేది జుట్టు. పండగ రోజున తలారా స్నానం చేసాక, జుట్టు ఆరబెట్టుకుని కొంచం నూనె రాసి, గట్టిగా "పోనీ" వేసుకుంటే జుట్టుకు, మాడుకి రంగులు అంతగా అంటవు.

4. హోలీ రోజున ఉదయాన్నే శరీరానికి కొబ్బరి నూనె రాయాలి. దానివలన రంగులతో డ్రైగా మారకుండా వుంటుంది. అలానే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ పట్టించాలి.

5. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే హోలీ సంబరాలు పూర్తి అయ్యేదాకా ఆ మేకప్ పాడవకుండా వుంటుంది. వాటర్ ప్రూఫ్ బేస్‌ని ముఖం నుంచి మెడ దాకా ఒక లేయర్‌గా వేసుకుంటే రంగులు చర్మానికి అతుక్కోకుండా వుంటాయి.

6. గోళ్ళని కాసేపు ఆలివ్ ఆయిల్‌లో ముంచి, ఆ తర్వాత గోళ్ళ రంగు వేయాలి. అప్పుడు హోలీ రంగుల ప్రభావం గోళ్ళ పైన పడకుండా వుంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , మరకల భయం లేకుండా హోలీ సంబరాలు సరదాగా చేసుకోవచ్చు.

-రమ