కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు

 

1. కుర్చీలోంచి కదలకుండా ఓ అరగంట కుర్చున్నారో...అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నిజానికి స్థిరంగా కూర్చోటమన్నది మానవులకు సరిపడదుట. అలా కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని ఎల్.పి.ఎల్ పనితీరు మందగిస్తుదట. ఎల్.పి.ల్ పనితీరు మందగిస్తే నష్టం ఏంటి అంటారా! ఈ ఎల్.పి.ఎల్ వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ, రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోకి మారుస్తుంది, సో కదలకుండా కూర్చున్నపుడు ఈ ప్రక్రియ అంతా మందగిస్తుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాలలో నిల్వ ఉండిపోతుంది. అందుకే ఎక్కువ సేపు అలా కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి పొట్ట త్వరగా వచ్చేది.

2). సహజంగానే ఆడవారికి పిల్లలు పుట్టాకా కాస్త నడుము, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే పనిగా కూర్చుని ఉద్యోగాలు చేసే వారి గురించి ఇక చెప్పేదిముంది. అవునూ ఇంతకీ పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే ఏమన్నా ఇబ్బందా అన్న డౌట్ వస్తోంది కదా! ఖచ్చితంగా దాని వలన ఇబ్బందే. పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైనదిట. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హార్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. రక్తనాళాలు పూడుకు పోవటం, స్థూలకాయం అధికరక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం వుందని హేచ్చరిస్తున్నారు పరిశోదకులు.

3) చాలా సేపు కదలకుండా కూర్చుంటే ఆరోగ్యనికి మంచిది కాదు. కండరాలు క్రమేపి బిగుసుకుపోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. అదేపనిగా ఒకేచోట కదలకుండా కూచునేవాళ్ళకి రోజు మొత్తం మీద ఒకేచోట  మూడుగంటలని మించి కూర్చోకూడదు. అదీ తప్పని సరైతే తప్ప. వీలునప్పుడు ప్రతీ అరగంటకి ఓసారి లేచి అటుఇటు కాసేపు తిరగటం మంచిది. లేదంటే ఇట్టే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం వుందని తేల్చిచెప్పారు అమెరికన్ పరిశోధకులు. ఇందుకుగాను సుమారు 1.20 లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలి, ఎంతసేపు ఒకేచోట కూర్చుంటున్నారు వంటి విషయాలని పరిశీలించారు. విశ్రాంతి సమయంలోనైన రోజుకి 3 గంటలకి పైగ కదలకుండా కూర్చునే వాళ్ళలో గండె జబ్బులు వంటివి రావటం గమనించారట. ఎట్టి పరిస్తితిలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చో వలసి వస్తే మాత్రం మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటం మంచిది.

4) మన అలవాట్లే మనల్ని కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకేచోట కూర్చోవటం కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తే కంప్యూటర్ దగ్గర అదే పనిగా ఎక్కువసేపు  గడిపితే మరో ప్రమాదం పొంచి వుంది. ఈ మధ్య మహిళలు కూడా కంప్యూటర్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర ఉండే ఆడవారికి ముఖం మడతలు పడటం, కళ్ళు జీవాన్ని కోల్పోవడం, వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందటున్నారు నిపుణులు. తీవ్రమైన రేడియేషన్ కారణంగా కంటి కింద వలయాలు రావటంతో పాటు చర్మ సాగి ముడతలు పదే ప్రమాదం కూడా ఉందట. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఉండవలసి వచ్చినపుడు మధ్య మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవటం తప్పని సరట.

-రమ