తినండి... నడవండి..
1) మీకు తెలుసా! తీసుకునే ఆహారం తగ్గించక పోయినా పర్వాలేదు. రోజు ఓ అరగంట పాటు నడిస్తే చాలు నడుము చుట్టూ పేరుకునే కొవ్వు కరిగించుకోవచ్చుట. నిజం ఎందుకంటే ఇలా రోజూ ఓ అరగంట పాటు నడిస్తే వారానికి సుమారు 15 కి.మీ. వరుకూ నడిచినట్లేనట- కాబట్టి దీనివల్ల రన్నింగ్, జాగింగ్ చేసిన వారితో సమానంగా ప్రయోజనం పొందచ్చు అంటున్నారు డుక్ యూనివర్శిటీ పరిశోధకులు. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి రుగ్మతల్ని చాలా వరుకు అరకట్టవచ్చని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ పొద్దున్నే లేచి రన్నింగ్,జాగింగ్లు చేయటం కుదరటం లేదని బాధపడక్కర లేదు. రోజు రాత్రి భోజనం తర్వాత అయినా ఇంటి పరిసరాలల్లో ఓ అరగంట పాటు నడిస్తే చాలు అని సూచిస్తున్నారు పరిశోధకులు. సో వీలుచేసుకుని రోజూ ఓ అరగంటపాటు నడవటం మొదలు పెట్టండి.
2) సాధారణంగా బరువు తగ్గాలంటే పూర్తిగా తిండి మానేయాలి అనుకుంటారు చాలామంది. కానీ రోజూ మనం తీసుకునే ఆహారాన్ని ఒక క్రమపద్ధతిలో తీసుకుంటే శరీరంలో నుంచి కొవ్వును తేలికగా కరిగించకోవచ్చట. అంటే రోజుకు మూడుసార్లు తినే ఆహారాన్ని అయిదు భాగాలుగా విడగొట్టి మూడుసార్లు భోజనం, రెండుసార్లు చిరుతిండ్లను తక్కువ మోతాదుల్లో తినటం మంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నట్లయితే ఆహారంలో ఉండే పీచు జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దాని వలన చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. అందుకే భోజనం చేసిన ప్రతిసారి 5 గ్రాముల పీచు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణలు.
3) పొట్టుతో సహా ఏవైనా చిరుధాన్యల్ని ఒక కప్పు అయినా తప్పనిసరిగా తినాలిట. అలాగే ఒక కప్పుడు గింజ ధాన్యాల్ని తీసుకోవాలి. దీని వలన సుమారు 5 గ్రాముల పీచు పదార్ధం లభిస్తుంది. కాబట్టి వీటిని ఉదయం టిఫిన్ తినటానికి ముందు తినటం మంచిది. ఇక అపిల్, నారింజ, అరటిపండు, అలాగే జామలలో ఏదో ఒకటి. వేరుశనగ ఓ గుప్పెడు, అలాగే చెక్కు తీసాక ఒక క్యారెట్, అలాగే చెక్కు తీయని ఒక కీర వంటివి మధ్యాహ్నం ఆహారంలో చేర్చాలి. భోజనానికి ముందు క్యారెట్, కీరా భోజనం తర్వాత పండు, తింటే సుమారు 4 గ్రాముల దాకా పీచుపదార్ధం లభించినట్టే. ఇక ముడిబియ్యం అన్నంలో కూడా పీచుపదార్థం లభిస్తుంది. కాబట్టి తినగలిగే వాళ్ళు ముడిబియ్యం అన్నం తినటం మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
4) ఆకుకూరలలో ఇనుము సమృద్ధిగా లభిస్తుందని మనందరికి తెలుసు. ప్రపంచం మొత్తం మీద 'రక్త హీనత' భారతీయ స్త్రీలలోనే చాలా ఎక్కువ అని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. "ఇనుము" లోపం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా యుక్తవయుసు అడపిల్లలో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని సమస్య తీవ్రమై ఇతర దుష్పభావాలు జరిగే దాకా గుర్తించటం లేదుట ఎవరూ. రోజూ ఆకుకూరలు తీసుకుంటే చాలా వరుకు ఈ "ఇనుము" లోపాన్ని అధికమించవచ్చు. కాని 'జంక్ పుడ్' కి అలవాటు పడిన యువత సాంప్రదాయక ఆహారానికి క్రమంగా దూరమయ్యి వివిధ రుగ్మతలని కోరి తెచ్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఆకుకురలని వండే విధానంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే వాటిని తినికుడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆకుకూరలని రెండు నిమిషాలు కంటే ఎక్కువ సేపు మంటపై ఉంచితే వాటిలోని పోషక విలువలు పోతాయి. కాబట్టి ఆకుకూరలని ఉండే విధానంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి.
-రమ