
'తండేల్'తో హిట్ మోడ్ లోకి వచ్చిన యువసామ్రాట్ నాగ చైతన్య తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నా హవా ఉంటుందని అంటూ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' తో వస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య చెప్తున్నది నిజమే అన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా వృష కర్మ భారీ బిజినెస్ డీల్ పూర్తి చేసుకుంది.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకి దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో దిల్ రాజు నమ్మకాన్ని, ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వృష కర్మ, ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాధించింది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను ‘వృషకర్మ’పై పాజిటివ్ బజ్ నెలకొంది.
ఇది కూడా చదవండి: సిగ్మా ఓటిటి డేట్ ఇదే: అక్టోబర్ 2 న థియేటర్స్ లోకి వచ్చింది!
.webp)
నాగచైతన్య సరసన గోల్డెన్ లెగ్ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తుండగా స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి రోల్ లో కనిపించనున్నారు. రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్ . త్వరలోనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4 వరల్డ్ వైడ్ రిలీజ్ కాగా ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు సమర్పిస్తున్నారు.
[vrushakarma Bags A Big Deal As Dil Raju Acquires Telugu States, vrushakarma Release date, vrushakarma movie releae date, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






