
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈరోజు(అక్టోబర్ 27) సాయంత్రం జరగనున్న ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, నెక్స్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ అనే భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
మరోవైపు వెంకటేశ్‌తోనూ ఎన్టీఆర్‌కు అనుబంధం ఉంది. గతంలో వెంకటేశ్ నటించిన ‘చింతకాయల రవి’ సినిమాలో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ అనుబంధాల నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తాడనే టాక్ మొదలైంది. అయితే ఆయన రాక ఇంకా ఖరారు కాలేదు.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండుసార్లు మారింది. తొలుత అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా, ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. చివరికి అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ నిజంగానే వస్తాడా? ఒకవేళ వస్తే త్రివిక్రమ్‌తో తన తదుపరి సినిమా గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయం చెబుతాడా? అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: టాలీవుడ్ స్టార్ AI సిక్స్ ప్యాక్.. బడా డైరెక్టర్‌కి చుక్కలు చూపిస్తున్న హీరో.!
[Jr NTR To Attend Aadarsha Kutumbam Event, Aadarsha Kutumbam Pre Release Event, Aadarsha Kutumbam Movie, Venkatesh, Trivikram Srinivas, Jr NTR, God of War, Telugu Film News]






