Home

»

Latest News

బ్లడీ రోమియోనా మజాకానా: ధురంధర్ హవా పక్కా!.సాక్ష్యం ఇదే!

Oct 27, 2026 11:19AM


మీరు హిట్టు అనుకోండి, ప్లాప్ అనుకోండి కలెక్షన్స్ విషయంలో మాత్రం డోంట్ కాంప్రమైజ్ అంటూ నాచురల్ స్టార్ నాని చాలా నాచురల్ గా 'ది ప్యారడైజ్' తో భారీగానే కలెక్షన్స్ సాధించాడు.ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ 'బ్లడీ రోమియో'ని ఓజి ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మొదటి లుక్ తోనే అంచనాలు పెంచుకోగా ఇప్పుడు కాస్టింగ్ విషయంలో అభిమానులు, సినీ ప్రేమికులు, విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తూ అంచనాలని రెట్టింపు చేసుకుంటుంది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ‘ధురంధర్’,  ధురంధర్ పార్ట్ 2 చిత్రాలలో తన అద్భుతమైన నటనతో  విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ప్రముఖ నటుడు వివేక్ సిన్హా బ్లడీ రోమియో’ చిత్రంలో ఒక కీలకమైన, ఉత్కంఠభరితమైన క్యారక్టర్  లో చెయ్యడానికి అధికారికంగా జాయిన్ అయ్యారు. మరి వివేక్ సిన్హా లాంటి పవర్ ప్యాక్డ్ విలక్షణ నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ‘బ్లడీ రోమియో’ కి పాన్ ఇండియా వ్యాప్తంగా అదనపు క్రేజ్ రావడం అనేది తథ్యం. ఆ కోవలోనే బ్లడీ రోమియో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ  మొత్తం 5 ప్రముఖ భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకి  సంబంధించిన లేటెస్ట్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్ దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యంత  వేగంగా సాగుతోంది. 

ఇది కూడా చదవండి: యువసామ్రాట్ వన్ మాన్ షో 'వృషకర్మ' భారీ డీల్: కొన్నది ఎవరనుకుంటున్నారు.. ష్.. గప్ చుప్!

 

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లో చిత్ర యూనిట్ కొన్ని అత్యంత ముఖ్యమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  నాని మునుపెన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త మేకోవర్, మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక గ్యాంగ్‌స్టర్ అనుకోకుండా చెఫ్‌గా మారే అత్యంత వినూత్నమైన మరియు ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో, రెండు విభిన్నమైన వైవిధ్యభూరితమైన షేడ్స్‌లో నాని ఈ చిత్రంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. 

 

 

[Dhurandhar Actor Vivek Sinha In Nani Bloody Romeo, Nani Bloody Romeo, Sujeeth director, Vivek Sinha, Dhurandhar movie, Nani new movie, Bloody Romeo Delhi shoot, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com