టాప్5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ 2021.. టాలీవుడ్ నుంచి 'వకీల్ సాబ్' ఒక్కడే!
on Dec 9, 2021
స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే చాలు ట్విట్టర్ లో ఆ మూవీ టైటిల్ తో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ కి అలవాటుగా మారిపోయింది. సినిమా ప్రకటన నుంచి విదులయ్యేవరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ట్రెండ్ చేస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా ఎన్నో మూవీస్ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ ఏడాది చివరిదశకు రావడంతో ఇప్పటివరకు 2021 లో అత్యధిక ట్వీట్స్ చేయబడిన టాప్-5 సినిమాల లిస్ట్ ను తాజాగా ట్విట్టర్ ఇండియా ప్రకటించింది. ఆ లిస్ట్ ఒక్క బాలీవుడ్ మూవీ కూడా చోటు దక్కటించుకోకపోవడం గమనార్హం.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!
2021 లో అత్యధిక ట్వీట్స్ చేయబడిన టాప్-5 సినిమాలలో మొదటి నాలుగు స్థానాలలో కోలీవుడ్ సినిమాలే ఉండటం విశేషం. అందులో కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సాంగ్స్, విజయ్ మేనరిజమ్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తున్న 'వలిమై' సినిమా రెండో స్థానంలో నిలిచింది. 2022, జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఇక మూడో స్థానం కూడా విజయ్ సినిమానే దక్కించుకుంది. విజయ్ నటిస్తున్న 'బీస్ట్' సినిమా మూడో స్థానంలో నిలిచింది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: `భీమ్లా నాయక్`కి క్రిస్పీ రన్ టైమ్.. ఒరిజినల్ కంటే అరగంట తక్కువే!
టాప్-5 లో కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన సంచలన మూవీ 'జై భీమ్' కూడా స్థానాన్ని దక్కించుకుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. ఇలా మొదటి మొదటి నాలుగు స్థానాలను కోలీవుడ్ సినిమాలు దక్కించుకోగా.. ఐదో స్థానంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' నిలిచింది. బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Also Read: ఊపిరి బిగపట్టించే, ఒళ్లు జలదరింపజేసే సీన్లతో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్
2021 లో అత్యధిక ట్వీట్స్ చేయబడిన టాప్-5 సినిమాలలో కోలీవుడ్ డామినేషన్ బాగా కనిపించింది. టాలీవుడ్ నుంచి వకీల్ సాబ్ మాత్రమే టాప్-5 లో స్థానం దక్కించుకోగా.. అసలు బాలీవుడ్ సినిమాల ఊసే లేకపోవడం ఆశ్చర్యం. అలాగే టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం. 2021 ముగియడానికి ఇంకా 20 రోజులు సమయముంది. ఈ మూడు సినిమాల విడుదల తేదీలు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఈ లోపు ఈ మూడు సినిమాలు ఏదైనా అద్భుతాన్ని చేస్తాయేమో చూడాలి.
Also Read