'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. సీతను పొట్టలో తన్నిన బ్రిటీష్ ఆఫీసర్!
on Dec 9, 2021

సినీ అభిమానులు వేయికళ్లతో వెయిట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ మనముందుకు వచ్చేసింది. "బ్రేస్ యువర్‌సెల్ఫ్" అంటూ హెచ్చరికతో వచ్చిన ట్రైలర్.. దానికి తగ్గట్లుగానే ఒళ్లు గగుర్పాటు కలిగించే మూమెంట్స్‌తో అదరిపోయే రేంజ్‌లో ఉంది. చరిత్రచెప్పని విషయాలతో, కల్పిత ఘట్టాలతో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో యస్.యస్. రాజమౌళి క్రియేట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఎలా ఉండబోతోందో చిన్న శాంపిల్ చూపించింది ఈ ట్రైలర్. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్‌తో తారక్, చరణ్.. ఇద్దరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో మనముందుకు రాబోతున్నారని అర్థమైపోయింది.
Also read: రూ. 50 కోట్ల క్లబ్‌లో 'అఖండ'! బాలయ్య కెరీర్ బెస్ట్!!
ట్రైలర్‌ని గమనిస్తే ఆలియా భట్‌కు సంబంధించిన ఓ అంశం ఆసక్తిని రేకెత్తించింది. మనం చదువుకున్న అల్లూరి సీతారామరాజు కథలో ఆయన ప్రేమించి, పెళ్లాడాలనుకున్న యువతిగా సీత కనిపిస్తుంది. అయితే తన ఆశయం కోసం పెళ్లిని వద్దనుకుంటాడు రామరాజు. రామరాజునే మనసులో నింపుకున్న సీత మరొకరిని భర్తగా అంగీకరించక చనిపోతుంది. అయితే 'ఆర్ఆర్ఆర్'లో మనం సీతకు సంబంధించి ఓ కొత్త కథను చూడబోతున్నామని ట్రైలర్ తెలియజేసింది.
Also read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!
ఇంట్లో తులసి మొక్క దగ్గర సీత ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అక్కడకు వచ్చిన ఒక బ్రిటీష్ పోలీసాఫీసర్ ఆమెను కడుపులో బూటుకాలితో తన్నడంతో, రెండు చేతులతో కడుపు పట్టుకొని, నొప్పితో సీత విలవిల్లాడటం మనం గమనించవచ్చు. బహుశా రామరాజు కోసమే అక్కడకు అతను వచ్చాడనీ, ఆమె నుంచి ఆశించిన సమాధానం లభించకపోవడంతో ఆమెను కాలితో తన్నాడనీ ఊహించుకోవచ్చు. లేదూ.. రామరాజుకు ఆత్మీయులైన వాళ్లను వేధించడంలో భాగంగానూ ఆమెను కొట్టివుండవచ్చు కూడా. ఇది మనం చదువుకోని కథ. Also read: మరదలు అనుష్పాల పెళ్లిలో భార్యతో పాటు మెరిసిన రామ్‌చరణ్

ఇంకో సీన్‌లో సీతను కలిసి వెళ్తున్న భీమ్ కనిపించాడు. అసలు రామరాజు, భీమ్ కలవడమే కల్పితమనుకుంటే, సీతను భీమ్ కలవడం మరింత ఊహాజనితమైన అంశం. ఆమెను కలిసి వెళ్తున్న భీమ్ కళ్లు తడవడం చూస్తే.. రామరాజుకు సంబంధించిన విషయాన్ని ఆమెకు చేరవేయడానికి భీమ్ అక్కడకు వచ్చాడనీ, ఆమె దగ్గర నిజం దాచిపెట్టినందుకు అతను బాధపడ్డాడనీ అనిపిస్తోంది. రామరాజు, సీత ప్రణయగాథ మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుందని ట్రైలర్‌ని జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే అంశం. సీతగా ఆలియా భట్ తన నటనతో మనల్ని మెస్మరైజ్ చేయడం తథ్యం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



