ఊపిరి బిగపట్టించే, ఒళ్లు జలదరింపజేసే సీన్లతో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్
on Dec 9, 2021
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల్లోనే అత్యధిక అంచనాలు ఉన్న సినిమా అయిన 'ఆర్ఆర్ఆర్' వచ్చే జనవరి 7న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో అత్యధిక థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 3 నిమిషాల 15 సెకన్ల నిడివివున్న ట్రైలర్ ఆద్యంతం ఊపిరి బిగపట్టించేలా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రోమాలు నిక్కబొడిపించే, ఒళ్లు జలదరింపజేసే సన్నివేశాలతో ఎమోషనల్‌గా ఈ ట్రైలర్ సాగింది.
Also read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!
ఒక్క అలీసన్ డూడీని మినహాయిస్తే చిత్రంలోని ప్రధాన పాత్రధారులందరినీ దాదాపుగా ఈ ట్రైలర్‌లో మనకు చూపించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని, రాజీవ్ కనకాల, రే స్టీవెన్‌సన్ లాంటి యాక్టర్లు ఈ ట్రైలర్‌లో కనిపించారు. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కనిపించిన తీరు చూస్తుంటే, వారి పాత్రలను రాజమౌళి ఎంతటి వీరోచితంగా మలిచాడో ఊహించుకోవచ్చు.
Also read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఎఫెక్ట్.. మా థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలి!
ఒకరికొకరు పరిచయమైన తర్వాత ఆ ఇద్దరూ మంచి మిత్రులవుతారనీ, తర్వాత జరిగిన పరిణామాల వల్ల కొమురం భీమ్‌ను బ్రిటీష్ సైన్యంలో పనిచేసే రామరాజు అరెస్ట్ చేస్తాడనీ తెలుస్తుంది. ఈ ఘటనతో భీమ్‌ను షాక్‌కు గురిచేస్తుందని ట్రైలర్ తెలియజేస్తుంది. ఒక గోండు పిల్లను బ్రిటీష్ వాళ్లు తీసుకుపోయి, ఖైదు చేయడంతో ఆమెను విడిపించడానికి భీమ్ వెళ్లడం కథలో కీలక ఘట్టం. చివరలో ఆ ఇద్దరూ కలుసుకుంటారనీ, బ్రిటీషర్లపై తిరగబడతారనీ ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. పోలీస్ గెటప్ నుంచి మారి అల్లూరి సీతారామరాజుగా కాషాయ వస్త్రం, విల్లంబులతో కనిపించిన చరణ్ గెటప్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ట్రైలర్ మొదట్లో క్లోజప్‌లో ఒకవైపు తారక్, మరోవైపు పెద్దపులి తలలను చూపిస్తూ, పులి గాండ్రిస్తే, తారక్ కూడా దానిలాగే పెద్దగా గాండ్రించే సీన్ సూపర్బ్. అలాగే తన బుల్లెట్ బండితో యాక్షన్ సీన్‌లో తారక్ చేసే విన్యాసాలు కూడా అదరహో అనిపించాయి. Also read: రూ. 50 కోట్ల క్లబ్‌లో 'అఖండ'! బాలయ్య కెరీర్ బెస్ట్!!
సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి బీజీఎం 'ఆర్ఆర్ఆర్'కు ఎస్సెట్ కానున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ట్రైలర్‌తోటే రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే ఇక మూడు గంటల సినిమాలో ప్రేక్షకుల్ని రంజింపజేసే ఘట్టాలు ఎన్ని ఉంటాయో ఊహించుకోవాల్సిందే. 'బాహుబలి 2'తో సెట్ చేసిన రికార్డులను 'ఆర్ఆర్ఆర్'తో బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరచడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడనేది రేపటి నిజం.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
